రాష్ట్రీయం

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపే వరకూ పోరు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ఆర్యసమాజ్ ప్రాచీనమైన వైదిక సంస్థని, సమాజంలో దురాచారాలను పారద్రోలిన సంస్థని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇక్డ ఆయన బేగంపేటలో ఆర్యసమాజ్ ఆశ్రమంలో జరిగిన ప్రతినిధుల సభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, ధర్మం కోసం భారతీయులను ఏకతాటిపైకి తెచ్చిన సంస్థ ఆర్యసమాజ్ అన్నారు. ఆర్యసమాజ్ స్ఫూర్తితో లాలాలజపతిరాయ్ లాంటి ఎందరో మహానుభావులు దేశం కోసం పనిచేశారన్నారు. గ్రామాల్లోకి రజాకార్లు రాకుండా యువకుల్లో స్ఫూర్తిని నింపి దోపీడీకి అడ్డుకట్టవేసిన సంస్థని ఆయన కొనియాడారు. ఆరస్యసమాజ్ నుంచి ప్రజాపోరాటం, పటేల్ సైనిక చర్యల వల్ల తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు. రజాకార్ల వారసులైన నేటి పాలకులు ఈ నెల 17వతేదీన విమోచన దినోత్సవాన్ని జరపడం లేదన్నారు. ఆర్య సమాజ్ వేదికనుంచి తాను కేసీఆర్‌ను ఇదే ప్రశ్న వేస్తున్నట్లు ఆయన చెప్పారు. మనం ఎందుకు తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడం లేదని, సెప్టెంబర్ 17 అతి ముఖ్యమైనరోజు అని చెప్పారు. జన్మదినాన్ని జరుపుకునే మనం తెఃలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం అధికారికంగా జరిపేంత వరకు పోరాటం ఆగదన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ బడుల్లో పాఠ్యాంశాల్లో కూడా చేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ జీ వివేక్ తదితరులు పాల్గొన్నారు.