రాష్ట్రీయం

కోడెల మృతిపై సీఎం కేసీఆర్ సహా పలువురి దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. సంతా పం తెలిపిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, వి హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు ఉన్నారు.
కోడెల కుటుంబానికి బాబు పరామర్శ..
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య పట్ల ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్‌బాబు నివాళులు అర్పించారు. కోడెల కుటుంబ సభ్యులలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోమవారం ఉద యం కోడెల తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి కుటుంబ సభ్యులు కోడెలను బసవతారకమ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు కోడెల మృతి చెందినట్లు దృవీకరించారని పోలీసులు తెలిపారు. కోడెల పార్థివ దేహాన్ని పార్టీ శ్రేణుల సందర్శనార్థం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు తరలించారు. కోడెల మృతి వార్త తెలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెం దిన పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు సీనియర్ నేతలు కోడెలకు నివాళులర్పించారు. కోడెల స్నేహితులు, అనుచరులు నివాళులు అర్పించారు. సినీ నటుడు బాలకృష్ణతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యమైన నివాళులర్పించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి.మోత్కుపల్లి నరసింహులు, కాంగ్రెస్ ఎం పీ రేవంత్‌రెడ్డి తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూధనాచారి, నాగం జనార్దన్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నా మా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నన్నపనేని రాజకుమారి, వీ హనుమంతరా వు, మంత్రి శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యేలు మా గంటి గోపీనాథ్, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఫరూక్ సీపీఐ చాడా వెంకటరెడ్డి, రామకృష్ణ, నారాయణ, మాజీ కాంగ్రెస్ మంత్రి జనార్ధనరెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరావు ఉన్నారు.

*చిత్రం...కోడెల మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ