రాష్ట్రీయం

29 మందితో టీటీడీ పాలకమండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 110 రోజుల తర్వాత పూర్తిస్థాయిలో టీటీడీ పాలకమండలిని నియామకం చేస్తూ బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీటీడీకి సంబంధించి ఇది 50వ పాలకమండలి. టీటీడీ చైర్మన్‌గా వై.వి.సుబ్బారెడ్డి జూన్ 22న బాధ్యతలు స్వీకరించారు. 88 రోజుల పాటు పాలకమండలి నియామకంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. మంత్రివర్గ విస్తరణకు కూడా తాను ఇంత సమయం తీసుకోలేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారంటే, బోర్డులో స్థానం సంపాదించడం కోసం ముఖ్యమంత్రిపై ఏమేరకు ఒత్తిళ్లు ఉన్నాయో అర్థమవుతుంది. వాస్తవానికి ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్, సభ్యులతో కలిపి 16 మంది, నలుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి 20 మందితో కమిటీ ఉండేది. అయితే ఎక్కువ మందిని సంతృప్తిపరచడం కోసం టీటీడీ పాలకమండలిలో సభ్యుల సంఖ్యను 29కి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆమేరకు ప్రభుత్వం నుంచి ఉత్వర్వులు కూడా జారీ అయ్యాయి. దీంతో చైర్మన్‌తోపాటు 25 మంది పాలకమండలి సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు కొత్త కమిటీలో కొలువుతీరారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ముందుగా టీటీడీ చైర్మన్‌ను నియమించి అటు తర్వాత రెండున్నర నెలలకు పైగా సభ్యులను నియమించకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 8 మందికి, తెలంగాణకు సంబంధించి ఏడుగురికి, తమిళనాడుకు చెందిన నలుగురికి, ఢిల్లీకి చెందిన ఒకరికి, మహారాష్ట్ర నుంచి ఒకరికి, కర్ణాటక నుంచి ముగ్గురికి బోర్డులో స్థానం కల్పించారు. తుడా చైర్మన్, టీటీడీ ఈఓ, దేవదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కమిషనర్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా కొనసాగుతారు. మొత్తం మీద 29 మందితో టీటీడీ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారు. యు.వి.రమణమూర్తి (ఎమ్మెల్యే), మేడా మల్లికార్జున రెడ్డి (ఎమ్మెల్యే), కె.పార్థసారథి (ఎమ్మెల్యే), పరిగెల మురళీకృష్ణ, కృష్ణమూర్తి వైద్యనాథన్, నారాయణస్వామి శ్రీనివాసన్, జె.రామేశ్వరరావు, వి.ప్రశాంతి, డి.పార్థసారథిరెడ్డి, డాక్టర్ నిచిత ముప్పవరపు, నాదెండ్ల సుబ్బారావు, డి.పి.అనంత, రాజేష్ శర్మ, రమేష్ శెట్టి, గుండవరం వెంకట భాస్కరరావు, మోరంశెట్టి రాములు, డి.దామోదరరావు, చిప్పగిరి ప్రసాద్ కుమార్, ఎం. ఎస్. శివశంకరన్, సంపత్ రవి నారాయణ, సుధానాయణమూర్తి, కుమారగురు ( ఎమ్మెల్యే) పుత్తా ప్రతాపరెడ్డి, కె.శివకుమార్ సభ్యులుగా నియమితులయ్యారు. కాగా ఈ నెల 31వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో నూతనంగా పాలకమండలిలో నియమితులైన సభ్యులు మరో రెండు మూడు రోజుల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 23, 24 తేదీలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులు యోచిస్తున్నారు. తిరుమలలో దళారీలను కట్టడి చేయడం కోసం టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, తిరుమల ప్రత్యేక అధికారి ఎ.వి.్ధర్మారెడ్డి వీ ఐపీ, ఆర్జిత సేవా టికెట్లను విచ్చలవిడిగా ఇవ్వకుండా కట్టుదిట్టమైన పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే పాలకమండలి ఏర్పడిన నేపథ్యంలో సభ్యులు టీటీడీ అధికారులకు సహకరిస్తారా? లేదా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే తీవ్ర నిరాశ నిస్పృహకు గురైన ప్రత్యక్షంగా, పరోక్షంగా దళారీ వ్యవస్థను నడుపుతున్న అనేక మంది బడా బాబులు పాలకమండలి ఎప్పుడు ఏర్పడుతుందా? వారి ద్వారా టికెట్లు పొంది సొమ్ము చేసుకోవాలని గోతికాడ నక్కల్లా కాచుకుకూర్చున్నారు. అయితే తిరుమలలో సామాన్య భక్తులకే పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులకు విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చివున్నారు.