రాష్ట్రీయం

కోడెల మృతిపై దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈనెల 16న కోడెల తన ఇంట్లో ఉరివేసుకున్న సంఘటన తెలిసిందే. కోడెల ఆత్మహత్య కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం మిస్టరీని తేల్చడానికి అన్నివైపుల నుంచి దర్యాప్తు జరుపుతోందని ఆయన తెలిపారు. కోడెల కుమారుడు శివరామ్‌ను త్వరలోనే విచారిస్తామని ఆయన చెప్పారు. అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 12 మందిని విచారించామన్నారు. కోడెల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామన్నారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు ముందు కోడెల ఎవరితో ఫోన్ మాట్లాడారు, కాల్‌డేటా కోసం ఆరా తీస్తున్నామని ఆయన చెప్పారు. సీడీఆర్‌ఏ కాల్ లిస్టు రిపోర్టును పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో కోడెల కాల్‌డేటాపై వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. కోడెల మృతి కేసులో కీలకం కానున్న మొబైల్ ఇంకా దొరకలేదన్నారు. సత్తెనపల్లిలో కోడెల బంధువు మేనల్లుడు కంచేటి సాయి ఇచ్చిన ఫిర్యాదు ఫ్యాక్స్ ద్వారా అందిందన్నారు. కోడెల సన్నిహితులను సైతం విచారణకు పిలుస్తామన్నారు. కోడెల సెల్‌ఫోన్ దొరికితే కేసులో పురోగతి లభిస్తుందన్నారు.