రాష్ట్రీయం

ఎన్‌ఎడిలో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 8: విశాఖలోని నేవల్ ఆర్మమెంట్ డిపో(ఎన్‌ఎడి)లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మమెంట్ డిపోలో ప్రెజర్ హౌస్‌లోని సిబ్బంది గన్ పౌడర్ క్యాట్రిజ్‌లోని పౌడర్‌కు కాలం చెల్లడంతో దాన్ని తీసి కొత్త పౌడర్‌ను నింపుతున్నారు. ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న సమయంలో క్యాట్రిజ్ స్క్రూను గట్టిగా బిగిస్తున్న సమయంలో అది రాపిడికి గురై గన్ పౌడర్ పేలి, మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి శరీరం చాలా వరకూ కాలిపోయింది. వి రమణ (46)కు 95 శాతం గాయాలు, సూరి దేముడుకు (65) 30 శాతం గాయాలు, బి హరనాథ్ (53)కు 30 శాతం గాయాలు, సుభసంత్‌కు 30 శాతం గాయాలు కాగా వీరిని స్థానిక కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.