రాష్ట్రీయం

590 అడుగులు దాటిన సాగర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు దాటిపోవడంతో బుధవారం రాత్రి నుండి 4 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రి సాగర్ జలాశయ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో ఎగువ నుంచి వస్తున్న నీటి కంటే సాగర్ జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వ, విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్న నీటి పరిమాణం తక్కువగా ఉండడంతో మంగళవారం రాత్రి నుండి 2 గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. బుధవారం రాత్రి వరకు కూడా 2 గేట్ల ద్వారానే 16,200 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. అయితే శ్రీశైలం నుండి 70 వేల క్యూసెక్కుల వరకు నీరు వచ్చి చేరుతుండడంతో సాగర్ జలాశయ నీటి మట్టం 590 అడుగులను మించిపోయింది. దీంతో డ్యాం క్రస్టు గేట్లను మరో 2 గేట్లు పెంచి మొత్తం 4 గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌కు బుధవారం రాత్రి 70,456 క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని సాగర్ నుండి బయటకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,258 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 7,778 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి ఎగువ నుంచి 1,26,250 క్యూసెక్కులు వస్తుండగా ప్రస్తుతం 884.30 అడుగులుగా ఉంది.
ఎడమ కాల్వకు నీరు నిలిపివేత
నాగార్జునసాగర్ జలాశయం నుండి ఎడమ కాల్వకు విడుదల చేస్తున్న నీటిని బుధవారం డ్యాం అధికారులు నిలిపివేశారు. గత 36 రోజులుగా ఎడమ కాల్వకు ఏకధాటిగా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. కాగా వారబందీ పద్ధతిలో మొదటి విడత నీటి విడుదలలో భాగంగా 24 రోజులు మాత్రమే నీటి విడుదల చేయాల్సి ఉండగా 36 రోజులు విడుదల చేశారు. దీనిలో భాగంగానే బుధవారం నాడు ఎడమ కాల్వ నీటి విడుదలను నిలిపివేశారు. మరలా 24వ తేదీ నుండి నీటి విడుదలను కొనసాగించనున్నారు.

*చిత్రం...సాగర్‌లో బుధవారం రాత్రి నుంచి 4 గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు