రాష్ట్రీయం

టీటీడీ బోర్డులో అదనంగా మరో ఏడుగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 19: టీటీడీ ధర్మకర్తల మండలిలో మరో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులను చేరుస్తూ రాష్ట్రప్రభుత్వం గురువారం జీఓను జారీ చేసింది. ఈ జిఓ ప్రకారం ముంబయి, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీకి చెందిన లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షులను టీటీడీ ధర్మకర్తలమండలి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. ఇప్పటికే 29మందితో ఉన్న పాలకమండలి తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో 36కు చేరినట్లు అయింది. వాస్తవానికి గతంలో ప్రత్యేక ఆహ్వానితుల ప్రస్తావన టీటీడీ పాలకమండలిలో లేని పరిస్థితి. గత ప్రభుత్వం ఈ నూతన విధానానికి తెరతీయడంతో జగన్ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తోంది. ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిబడ్డ వారిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షులు, ఎంపీ రాకేష్ సిన్హా, చెన్నై లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షులు ఏ జె శేఖర్, బెంగళూరు అడ్వయిజరీ కమిటీ అధ్యక్షులు కుపేంద్రరెడ్డి, హైదరాబాద్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షులు గోవిందహరి, భువనేశ్వర్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షులు దుష్మంత్‌కుమార్ దాస్, ముంబయి అడ్వయిజరీ కమిటీ సభ్యులు అముల్‌ఖాలేలను నియమించారు. అయితే టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాల్లో వీరికి ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. కేవలం వారు సలహాలు, సూచనలకు పరిమితం చేస్తూ జీఓ జారీ చేసింది.
23న సభ్యుల ప్రమాణ స్వీకారం
ఇదిలావుండగా టీటీడీ 50వ ధర్మకర్తల మండలిలో సభ్యులుగా నియమితులైన వారు సోమవారం నాడు ఉదయం 9 నుండి 10.30గంటల లోపల ప్రమాణస్వీకారం చేయనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం తొలిసమావేశం అన్నమయ్య భవన్‌లో జరగనుంది.