రాష్ట్రీయం

పండుగలకు 264 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రానున్న దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగులతో పాటు వచ్చే డిసెంబర్ వరకు వివిధ మార్గాల్లో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు 264 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ- రాయచూర్ (రాయలసీమ) కాకినాడ మధ్య (07245 -07246) 78 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లు అక్టోబర్ నుంచి వారానికి ఒకసారి రాకపోకలు సాగిస్తాయి. కాకినాడ- కర్నూల్ కాకినాడ మధ్య (07237- 07238) 54 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కాచిగూడ - శ్రీకాకుళం- కాచిగూడ మధ్య 07016 రైలును ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం- తిరుపతి మధ్య 07479 ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. కరీంనగర్ - తిరుపతి -కరీంనగర్ మధ్య 80 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్ -తిరుపతి మధ్య 02761-02762 ప్రత్యేక రైలును నడుపుతారు. హైదరాబాద్- కొచ్చివేలి (07115-07116) మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్- ఎర్నాకుళం (07117- 07118) మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు రిజర్వేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని రైల్వే సీపీఆర్‌వో రాకేశ్ తెలిపారు.