రాష్ట్రీయం

టీటీడీ ధర్మరక్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి : నూతనంగా ఏర్పడిన టీటీడీ ధర్మకర్తల మండలిలో ముగ్గురులు సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ప్రమాణస్వీకారం చేశారు.
ఇందులో భాగంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆలయంలో టీటీడీ ట్రస్ట్‌బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. తరువాత కృష్ణమూర్తి వైద్యనాథన్ ఉదయం 10.50గంటలకు ప్రమాణస్వీకారం చేయగా, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి ఉదయం 11గంటలకు ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ తిరుపతి జే ఈ వో బసంత్‌కుమార్ సభ్యులందరితో ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండదపంలో సభ్యులకు వేదపండితులు వేద ఆశీర్వాచనం చేశారు. ఆలయం వెలుపల ఎక్స్‌అఫిషియో మెంబర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆస్థానంలో సేవలందించే అవకాశం మూడవసారి తనకు రావడం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నానన్నారు. తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. భక్తులకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని బోర్డు సభ్యులు కృష్ణమూర్తి అన్నారు. బోర్డు సభ్యులు ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సామాన్య భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.
బాధ్యతాయుతంగా తన విధులు నిర్వహించేందుకు కావాల్సిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు. ఈ కార్యక్రమంలో సి వి ఎస్ ఓ గోపీనాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, డిప్యూటీ ఈవో(జనరల్) సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
*చిత్రాలు.. తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వేమిరెడ్డి ప్రశాంతి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాలు ఇచ్చి సన్మానిస్తున్న టీటీడీ ఈఓ సింఘాల్, ప్రత్యేక అధికారి తదితరులు