రాష్ట్రీయం

లలితా మహా త్రిపుర సుందరిగా ఓరుగల్లు భద్రకాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 3: వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు గురువారం నాటికి ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నకం ప్రాతః కాల పూజ కాగానే నవరాత్ర విశేష సేవలు ప్రారంభించారు. ఐదవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ‘లలితా మహా త్రిపుర సుందరి’గా అలంకరించి అమ్మవారికి గంధోత్సవం జరిపారు. వారాహ పురణాంతర్గత నవ దుర్గా క్రమాన్ని అనుసరించి అమ్మవారికి స్కంద మాతా దుర్గా క్రమంలోను సాయంత్రం బోదాయనోక్త దేవపూజా విధిననుసరించి దూమ్రహా క్రమంలోను పూజారాధనలు జరిపి సాయంత్రం 7 గంటలకు నిత్యబల్యత్సవం జరిపి సాలబంజిక సేవపై అమ్మవారిని ఊరేగింపు జరిపారు. స్కందమాతను ఆరాధించిన వారికి పరాక్రమం, శత్రుపలాయనం, అధికారం, ఆరోగ్యం ఇవన్నీ కలుగుతాయి.

*చిత్రం... విశిష్టాలంకరణలో భద్రకాళి