రాష్ట్రీయం

టోల్‌గేట్లకు తిరుగు ప్రయాణ తాకిడి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/చౌటుప్పల్, అక్టోబర్ 9: దసరా పండుగ సెలవుల నేపధ్యంలో రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ నుండి విజయవాడ, గుంటూరు జిల్లాలకు వెళ్లి తిరుగు ప్రయాణమైన ప్రజలు, ఉద్యోగుల వాహనాల రద్దీతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని విజయవాడ-హైద్రాబాద్, అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారుల టోల్‌గేట్లు కిక్కిరిశాయి. బుధవారం విజయవాడ నుండి హైద్రాబాద్ వెపు వెలుతున్న వాహనాలతో కేతెపల్లి మండలం కోర్లపహడ్, చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ల వద్ధ రద్ధీ పెరిగింది. ముఖ్యంగా కొర్లపహడ్ టోల్ గేటుగా మీదుగా, ఇటు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి మాడ్గులపల్లి టోల్‌గేట్ మీదుగా వస్తున్న వేలాది వాహనాలతో పంతంగి టోల్‌గేట్ వద్ధ ట్రాఫిక్ పెరిగింది. గంటల వ్యవధిలో వేలాదిగా వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొనడంతో టోల్‌గేట్ సిబ్బంది ట్రిమ్ మిషన్లు(వాహనాల వద్ధకు వెళ్లి టోల్ వసూలు చేసే యంత్రాలు)లను వినియోగించి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టారు. పంతంగి టోల్‌గేట్ వద్ధ 12ట్రిమ్ మిషన్లు పెట్టడంతో పాటు హైద్రాబాద్ వైపు వెళ్లే టోల్‌గేట్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ కాకుండా చూశారు. ఆయా టోల్‌గేట్ల వద్ధ స్థానిక పోలీసులు సైతం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రంగంలోకి దిగారు.

*చిత్రం... విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారి మార్గంలో పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ దృశ్యం