రాష్ట్రీయం

పూర్తిస్థాయిలో సాగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆక్టోబర్ 9: నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్ధాయి నీటిమట్టం 5980 అడుగులు దాటిపోవడంతో బుధవారం నాడు 4 క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రి పూర్తి స్ధాయి నీటిమట్టానికి సాగర్ చేరుకోవడంతో రాత్రి నుండి 2 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తూ బుధవారం మధ్యాహ్నాం వరకు కూడా కొనసాగించారు. బుధవారం మధ్యాహ్నాం నుండి 4గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి 91,268 క్యూసెక్కుల నీరు వస్తుండగా కుడి కాల్వ ద్వారా 9,800 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,130 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు 4 క్రస్టు గేట్లలో 2 గేట్లు ఐదు అడుగులు మరో 2 గేట్లు 10 అడుగుల మేరకు ఎత్తి 46,226 క్యూసెక్కులను మొత్తంగా వచ్చింది వచ్చినట్లుగా 91,268 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి 79,810 క్యూసెక్కులు వస్తుండగా 884.90 అడుగులుగా ఉంది.

*చిత్రం... 4 గేట్ల ద్వారా నీటి విడుదల