రాష్ట్రీయం

వారం లోపలే రైతుబంధు జమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, అక్టోబర్ 9: రైతు శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, రైతు శ్రేయస్సు కొరకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం రైతులకు పాడిపరిశ్రమ అభివృద్ధిలో భాగంగా జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఆవులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఆవులకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రైతులకు ఆవులను పంపిణీ చేపట్టే మంచి కార్యక్రమానికి నేను రావడం చాల అదృష్టంగా నేను భావిస్తున్నాని, గోదానం కన్నా మించి మరేదానం లేదని మంత్రి తెలియజేశారు. గోవులు ఎక్కడ ఉంటే అక్కడ సకాలంలో వర్షాలు కురవడమే కాక పంటలు బాగా పండుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆవులను పెంచి పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గద్వాల జిల్లా కలెక్టర్ కె.శశాంక, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు ఎంతో శ్రమించి గద్వాల రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఉద్దేశ్యంతో ఆవుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వారిని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని, దేశంలో ఆర్థిక మాంధ్యం ఉన్న కూడా సీఎం కేసీఆర్ రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.38618 కోట్లు కేటాయించి ఖర్చుపెడుతుందని సభాముఖంగా తెలియజేశారు. నియోజకవర్గంలో ఇంకా 18 శాతం రైతు బంధు డబ్బులు అందలేదని, త్వరలోనే రైతులకు అందేలా కృషి చేస్తామన్నారు. త్వరలో గట్టు ఎత్తిపోతల పథకం, తుమ్మిల కాలువల నిర్మాణం చేపట్టి నడిగడ్డ ప్రాంతంలో శాశ్వత పరిష్కారం చూపించి వ్యవసాయానికి పూర్తిస్థాయిలో సాగు నీరందిస్తామని మంత్రి అన్నారు. ఆవులు తీసుకునే రైతులు పాలు విజయడైరీలోనే పోస్తే లీటర్ మీద అదనంగా రూ.4 పొందవచ్చని, త్వరలోనే పాలశీతల కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం డ్రిప్పు ద్వారా లబ్దిదారులకు ఆవులను పంపిణీ చేశారు. అంతకుముందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడి నుంచి నన్ను అసెంబ్లీకి తీసుకెళ్లుతానని మంత్రి చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం నన్ను అసెంబ్లీకి తీసుకెళ్లినందుకు ఆయనకు నేను ఎంతో రుణపడి ఉంటానని ఎమ్మెల్యే తెలియజేశారు. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్‌రావు హాయంలో నెట్టెంపాడు, ర్యాలంపాడు రిజర్వాయర్‌లను పూర్తి చేసి గద్వాల ప్రాంతంలో సాగునీరందించిన ఘనత మంత్రి హరీష్‌రావుకే దక్కుతుందని అన్నారు. గద్వాలలో నిరుద్యోగం పారదోలడానికి తన వంతుగా రైతులను ప్రోత్సహించడానికి నియోజకవర్గానికి 410 ఆవులను తీసుకవవచ్చి రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గం వెనుకబడి ఉందని, నియోజకవర్గాన్ని ఆదుకోవాలని మంత్రిని కోరారు. అనంతరం లబ్దిదారులకు ఆవులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర వినియోగదారుల చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత, వైస్ చైర్‌పర్సన్ సరోజమ్మ, జిల్లా కలెక్టర్ కె.శశాంక, జాయింట్ కలెక్టర్ జె.నిరంజన్, ఆర్డీఓ రాములు, గ్రంథాలయ శాఖ చైర్మన్ బీఎస్ కేశవ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కేశవసాయి, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటిసిలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం... సభలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు