రాష్ట్రీయం

విరిగిన రైలు పట్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, అక్టోబర్ 9: విశాఖ జిల్లా కశింకోట మండలం నర్శింగబిల్లి-పరవాడపాలెం సమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. దీంతో స్థానికులు, రైల్వే అధికారులు గుర్తించి రైళ్ళను దారి మళ్లించారు. విశాఖపట్నం-విజయవాడ వెళ్లే మార్గంలో పట్టా విరిగిపోవడంతో అధికారులు వెంటనే స్పందించి రైళ్ల రాకపోకలను నియంత్రించారు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టారు. దసరారోజు మంగళవారం కావడం, రైళ్లలో ఉన్న ప్రయాణికులు విషయం తెలిసి ఆందోళనకు గురయ్యారు. అయితే అధికారులు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలు చర్యలు తీసుకున్నారు.