రాష్ట్రీయం

నీళ్లు తోడేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: కృష్ణా జలాల నుంచి రబీ సాగుకు తెలంగాణకు 79 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 150 టీఎంసీల నీటిని కేటాయించాల్సిందిగా కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఇరు రాష్ట్రాలు ఇండెంట్ పెట్టాయి. దీనిపై అధికారిక ఉత్తర్వులు శుక్రవారం విడుదల చేయనున్నట్టు బోర్డు వెల్లడించింది. జల సౌధలో గురువారం సమావేశమైంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబందించిన కృష్ణా జలాల కేటాయింపు, వినియోగం, విడుదలపై ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులతో కృష్ణాబోర్డు చర్చించింది. ఇలా ఉండగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వాడుకున్న నీటి వినియోగం, రబీ సీజన్‌కు అవసరమైన నీటి కేటాయింపులపై ప్రధానంగా బోర్డు చర్చించింది. పోతిరెడ్డిపాడు, కేసీ కెనాల్, నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి కేటాయించిన దానికంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ నీటిని వాడుకున్నట్టు తెలంగాణ అధికారులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 18 టీఎంసీలు, కేసీ కెనాల్ నుంచి 8.5 టీఎంసీలు మాత్రమే వాడుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ అధికారులు బోర్డుకు వివరించారు. అయితే కేటాయించిన దానికంటే 21 టీఎంసీలను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వాడుకుందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల సమయంలో తాము పట్టిసీమ నుంచి సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటినే తాము వాడుకున్నట్టు ఏపీ అధికారులు బోర్డుకు వివరించారు. సముద్రంలో వృధా కలిసే వరద నీటిని వాడుకుంటే తప్పేమిటని ఏపీ అధికారులు సమర్థించుకున్నారు.
నాగార్జునసాగర్ ఎడవ కాలువ నుంచి తెలంగాణ 17 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 11 టీఎంసీలను మాత్రమే వాడుకున్నట్టు ఇరు రాష్ట్రాల అధికారులు బోర్డుకు వివరించారు. రబీ సీజన్‌కు నాగార్జునసాగర్ నుంచి తమకు 150 టీఎంసీలు కేటాయించాలని ఏపీ అధికారులు కోరగా, తెలంగాణ అధికారులు 79 టీఎంసీలు కావాలని బోర్డుకు లిఖితపూర్వకంగా అందజేశారు. ఈ నెల 15న మరోసారి సమావేశమై వర్కింగ్ మాన్యువల్‌పై ఖరారు చేయనున్నట్టు బోర్డు ప్రకటించింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నాగార్జునసాగర్ ఎస్‌ఇ ఆర్‌వీ ప్రకాశ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ్ధర్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఈలు బాబురావు, మనవోహర్‌రాజుతో పాటు కృష్ణానదీ పరివాహక ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.