రాష్ట్రీయం

నిష్క్రమణ దిశగా నైరుతి రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. ఇప్పటికే పంజాబ్, హర్యానాల నుండి ఇవి పూర్తిగా నిష్క్రమించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. అలాగే చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో నైరుతిరుతుపవనాలు నిష్క్రమించాయి. దేశంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా ఉపసంహరణకు పరిస్థితి అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఈ నెల 15 తర్వాత రుతుపవనాలు ఉపసంహరణ జరిగే అవకాశం ఉందని అంచనావేశారు. ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాల రాక దాదాపు వారం, పదిరోజుల నుండి 15 రోజుల వరకు ఆలస్యమైంది. తెలంగాణలో రెండోవారంలో రావలసిన నైరుతిరుతుపవనాలు మూడోవారం చివరలో వచ్చాయి. అలాగే అక్టోబర్ 1 వరకే ఉపసంహరణ జరగాల్సి ఉన్నప్పటికీ 15 రోజుల పాటు ఆలస్యమవుతోంది. ఈ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు వాతావరణ శాఖతో పాటు వివిధ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.