రాష్ట్రీయం

ప్రణబ్‌తో గవర్నర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటి అయ్యారు. పునర్య్వవస్థీకరణ చట్టం అమలుపై ఆయన రాష్టప్రతితో చర్చించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులు, శాసనసభ స్థానాల పెంపువంటి అంశాల గురించి కూడా రాష్టప్రతికి గవర్నర్ వివరించినట్టు తెలిసింది. అలాగే, హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితి, ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలకు సంబంధించిన అంశాలపైనా ఈ సమావేశంలో దృష్టి సారించారు. ఇరు రాష్ట్రాలు ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నందున అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కూడా రాష్టప్రతికి గవర్నర్ వెల్లడించినట్టు తెలిసింది. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్‌ను కూడా గవర్నర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజన అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలిసింది. ప్రధాని కార్యాలయానికి కూడా వెళ్లిన గవర్నర్ నరసింహన్ సుమారు గంటన్నర పాటు పిఎంఓ కార్యదర్శి నృపేంద్ర మిశ్రాతో గంటన్నరపాటు చర్చలు జరిపారు.