రాష్ట్రీయం

కన్నుల పండువగా చండీయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, అక్టోబర్ 13: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో 5 రోజుల పాటు జరగనున్న చతుర్వేద స్వాహాకార పురస్పర రుద్ర హవన సహిత సహస్ర చండీ యాగం ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గ్రామ నివాసి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యాగాన్ని శృంగేరి పండితులు విరివింటి ఫణి శశాంక శర్మ, వ్యాసోజుల గోపికృష్ణ శర్మ వైదిక నిర్వహణలో పలువురు అర్చకులు, పండితుల వేదోచ్ఛరణల మధ్య పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యాగంలో భాగంగా ఆదివారం ఉదయం గురు దేవతా ప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగన్య మేళనం, ప్రాశనం, మహాసంకల్పం, ఆచార్యాది రుత్విగ్వరణం, దేవనాందీ యాగశాల సంస్కారం, సహస్ర మోదక గణపతి హవనం, గో పూజ చండీ యంత్ర స్థాపనం, రుద్ర పురశ్చరణ చతుర్వేద హవన ప్రారంభం, సప్తశతీ పారాయణం, ఏకోత్తర వృద్ధిగ, సవరణ పూజ, సువాసిని, కన్యకా పూజ, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు వందలాది మంది భక్తుల నడుమ నిర్వహించారు. అనంతరం సాయంకాలం ప్రారంభమైన చండీయాగ పూజల్లో భాగమైన నవాక్షరీ మూలమంత్ర అనుష్టానం, రుద్రక్రమార్చన, అష్టావధానసేవ వంటి పూజలను యాగశాలలో నిర్వహించారు. ఓ వైపు చండీయాగం పూజలు జరుగుతుండగా మరో వైపు మహిళలతో కుంకుమ పూజలు దశలవారిగా నిర్వహిస్తూ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. యాగానికి వచ్చిన పలువురు ప్రముఖులు ప్రవచనాలను వినిపించారు. అమ్మవారి భక్తి నృత్యప్రదర్శనలు కళాకారులచే ప్రదర్శించి హాజరైన భక్తులకు కనువిందు కల్గించారు. ఈ సహస్ర చండీయాగం ప్రారంభానికి కృష్ణాజిల్లా తిరువూరు, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు రక్షణనిధి, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొత్తగూడెం జడ్పీటీసీ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి ప్రసాదరెడ్డి దంపతులతో పాటు పలువురు భక్తులు యాగంలో పాల్గొన్నారు.
*చిత్రం..చండీయాగం నిర్వహిస్తున్న దృశ్యం