రాష్ట్రీయం

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీనివాసుడు గరుడునిపై కొలువుదీరి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అభయ ప్రదానం చేశారు. శ్రీవారి వాహనం ముందు భాగాన గజరాజులు, భక్తజన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ముందుకు సాగాయి. శ్రీవారి ఉత్సవాల్లో గరుడ వాహన సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గరుడునిపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుని వేద స్వరూపుడిగా, రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరషేయత్వానికి ప్రతీకలని పేర్కొంటున్నారు. పున్నమి వెలుగుల్లో, విద్యుత్ దీపకాంతుల నడుమ స్వామివారి గరుడ వాహన సేవకు భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం... గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీవారు