రాష్ట్రీయం

ఎన్నికలకు సిద్ధమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 18: ‘వైకాపా తరపున గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. ఎన్నికలకు వెళ్దాం..నీ పాలనకు వారి గెలుపోటములే రెఫరెండం. నేను రెడీ.. నీకు సమ్మతమేనా’ అంటూ విపక్ష నేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ చేపట్టిన దీక్షను ఆదివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. అమర్‌నాథ్‌ను కెజిహెచ్‌కు తరలించారు. అక్కడ చేరినప్పటికీ వైద్యాన్ని తిరస్కరించిన అమర్ దీక్ష కొనసాగించారు. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి సోమవారం విశాఖ చేరుకుని ఆసుపత్రిలో ఉన్న అమర్‌ను పరామర్శించారు. నిమ్మరసం ఇచ్చి అమర్‌తో దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా జగన్ విలేఖరులతో మాట్లాడారు. ‘నీ రెండేళ్ల పాలన అద్భుతంగా ఉందంటూ డబ్బాకొట్టుకుంటున్నావు. నీ పాలన అద్భుతంగా ఉందన్న నమ్మకం నీకుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి గెలిపించుకో’ అంటూ సవాల్ విసిరారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చావు, మళ్లీ ఎన్నికలకు వెళ్తే తగిన శాస్తి చేస్తారని భయపడుతున్నావ’ని అన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టు వస్తేనే న్యాయం జరుగుతుందని, వీటిని ఇవ్వకుండా కేంద్రం దగాచేస్తోందన్నారు. బిజెపితో అధికారం పంచుకున్న చంద్రబాబు కేంద్రాన్ని మాటమాత్రంగానైనా నిలదీసిన పాపానపోలేదన్నారు. కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్న ఇద్దరు తెలుగుదేశం ఎంపిలను ఉపసంహరించుకుని, హోదా కోసం నిలదీయాలని డిమాండ్ చేశారు. అధికార పగ్గాలు అందుకుని రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ కేంద్రం నుంచి ఒక్క హామీ సాధించుకోలేని అసమర్ధ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చెలాయిస్తోందని జగన్ మండిపడ్డారు.
బాబుకే జాబు వచ్చింది
ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తెలుగు ప్రజలను నిలువునా మోసం చేశారని జగన్ ధ్వజమెత్తారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారని, అయితే యువత ఓట్లేస్తే చంద్రబాబుకు మాత్రం ముఖ్యమంత్రి జాబు వచ్చిందని, ఓట్లేసిన కాంట్రాక్టు, ఔక్ సోర్సింగ్ సిబ్బంది ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు.
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధనకు అమర్‌నాథ్ చేపట్టిన దీక్షకు అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందని, దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు దీక్షను భగ్నం చేయడం ద్వారా తన కుతంత్రాన్ని చాటుకున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అద్దంపట్టే రైల్వేజోన్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. అమర్ దీక్ష ఆరంభం మాత్రమేనని అన్నారు.

చిత్రం విశాఖపట్నంలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్