రాష్ట్రీయం

గోల్డ్ స్కీంలో శ్రీవారి బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 18: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గోల్డ్ మానిటైజేషన్ పథకంలో తిరుమల శ్రీవారి బంగారం కూడా భాగస్వామ్యం అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేంకటేశ్వరస్వామి వారికి చెందిన 1311 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి. సాంబశివరావు సోమవారం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని ఇఓ కార్యాలయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ శ్రీవారి హుండీ ద్వారా సంవత్సరానికి దాదాపు ఒక టన్ను బంగారం కానుకల రూపంలో అందుతోందని తెలిపారు. ఈ బంగారాన్ని అదే రూపంలో ఉంచేందుకు బ్యాంకుల నుంచి కొటేషన్లు ఆహ్వానించి డిపాజిట్ చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా 1311 కిలోల బంగారాన్ని 1.75 శాతం వడ్డీరేటుతో మూడేళ్ల కాలపరిమితి గల స్వల్పకాలిక డిపాజిట్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు. మధ్యకాలిక, దీర్ఘకాలిక కాల పరిమితుల్లో బంగారం డిపాజిట్ చేసేందుకు గోల్డ్ మానిటైజేషన్ పథకంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం భారత ప్రభుత్వానికి , రిజర్వు బ్యాంకు వారికి లేఖలు రాశామని, అనుమతి లభిస్తే మధ్యకాలిక, దీర్ఘకాలిక కాలపరిమితుల్లోనూ బంగారం డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జె ఇ ఓ పోలాభాస్కర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సి ఎం డి ఉపా అనంతసుబ్రహ్మణియన్, జనరల్ మేనేజర్ వినోద్ జోషి, డి జి ఎంలు అశోక్‌కుమార్, అశ్విన్‌కుమార్, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి బాలాజి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.