రాష్ట్రీయం

టమోటా ధర ఢమాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్తికొండ, అక్టోబర్ 18: టమోటా ధర మరింత దిగజారడంతో రైతులకు కడుపుకోత మిగిలింది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో వరుసగా రెండవ రోజు శుక్రవారం టమోటా ధర ఒడిదుడుకులకు లోనైంది. మధ్యాహ్నం 10 కిలోల జత గంపల టమోటాను రూ.300 నుంచి రూ.400లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ధర అమాంతం రూ.30కి పడిపోయింది. దీంతో వ్యాపారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. టమోటాలు పారబోసి నిరసన తెలిపారు. గురువారం టమోటా ధర తగ్గడంపై రైతులు ఆందోళన చేయడంతో శుక్రవారం కొనుగోలు చేస్తామని అధికారులు నచ్చజెప్పారు. దీంతో శుక్రవారం ఉదయం మార్కెటింగ్‌శాఖ జేడీ సుధాకర్ మార్కెట్‌యార్డు ఆవరణలో మిగిలిపోయిన టమోటాలను వ్యాపారులతో కొనుగోలు చేయించారు. తరువాత మధ్యాహ్నం నుండి మార్కెట్‌కు మిగతా రైతులు టమోటాలు తీసుకువచ్చారు. అయితే ధర తగ్గిపోయిందంటూ జత గంపలను రూ.30కి కొంటామని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. ధర తగ్గించిన వ్యాపారులతో వాగ్వివాదానికి దిగారు. టమోటాలను మార్కెట్‌లో పారబోసి నిరసన తెలిపారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మరింత మంది రైతులు లారీల్లో టమోటాలను మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చారు. ధర తగ్గిపోయినట్లు తెలుసుకుని నిరాశకు గురయ్యారు. ఇదే సమయంలో వ్యాపారులు టమోట కొనుగోళ్లను నిలిపివేశారు. జేడీ ఏ.సుధాకర్ మరోసారి జోక్యం చేసుకుని వ్యాపారులతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. దీంతో మార్కెట్‌యార్డులో టమోటా కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా దాదాపు ఐదు లారీల సరుకు నిలిచిపోయింది. కొనుగోలుదారుల కోసం రాత్రి 7 గంటల వరకు రైతులు ఎదురుచూశారు. కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో యార్డులో టమోటాలు అలాగే నిలిచిపోయాయి.