రాష్ట్రీయం

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: దేశ సమగ్రతను కాపాడేలా యువతను ఒక శక్తిలా రూపుదిద్దాలని జనసేన పోలిట్‌బ్యూరో నిర్ణయించింది. హైదరాబాద్ జనసేన కార్యాలయంలో జరిగిన పోలిట్‌బ్యూరో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చించింది. సమావేశానికి పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అధ్యక్షత వహించారు. నాదెండ్ల మనోహర్, డాక్టర్ పాపిశెట్టి రామమోహనరావు, అర్హంఖాన్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ దృక్పథంతో ప్రాంతీయతను అర్ధం చేసుకుని జాతి సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా జనసేన పనిచేస్తోందని అన్నారు. ఆంధ్రాలో ఆర్ధిక పరిస్థితి అతలాకుతలమైందని, ఆంధ్రాలో ఇసుక లభ్యత లేక 35 లక్షల మందికి ఉపాధి కరవైందని, ఎపీపీఎస్సీలో కొత్తగా చేసిన మార్పుల వల్ల గ్రామ సచివాలయ ఉద్యోగాల మాదిరి చేస్తారనే యువతలో ఆందోళన వ్యక్తమవుతోందని పోలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ఎపీపీఎస్సీ ఎంపిక పరీక్షల విధానంలో మార్పులు సరికాదని, శాశ్వత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌గా తయారుచేసేలా వైకాపా నేతల తీరు ఉందని చివరికి రాజధాని లేకుండా చేస్తారా అంటూ పోలిట్‌బ్యూరో ప్రశ్నించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సన్నద్ధత కావాలని నిర్ణయించారు. ఆర్టికల్ 370 రద్దు మంచి నిర్ణయమని పేర్కొన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితిపైనా పోలిట్‌బ్యూరో సమీక్షించింది. ఎటువంటి చర్యలు చేపడితే ఆర్ధిక మాంద్యం నుండి దేశం బయటపడుతుందో అనే అంశాలపై కూడా సమావేశం దృష్టి పెట్టింది. ఇందుకు కేంద్రానికి మూడు అంశాలను సూచించింది. రోడ్డు పక్కన జరిగే చిన్న చిన్న వ్యాపారులు మొదలు పెద్ద వ్యాపారుల వరకూ సులభతరమైన పద్ధతుల్లో అనుమతులు లభించే విధంగా వ్యవస్థకు రూపకల్పన చేయాలని సమావేశం సూచించింది. అనుమతుల కోసం సింగిల్‌విండో విధానం, ఆర్ధిక సహాయం ఇచ్చేలా ఆర్ధిక వ్యవస్థను రూపొందించాలని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణకు అంతా పాటుపడాలని, ఆర్టీసీ సమ్మెను తెలంగాణ సీఎం స్వయంగా పరిష్కరించాలని జనసేన పేర్కొంది. యురేనియం కాలుష్యకారకమని, యురేనియం తవ్వకాల వల్ల చాలా నష్టం వాటిల్లుతుందని జనసేన నేతలు పేర్కొన్నారు. ఆంధ్రాలో ఇసుక కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, రాష్ట్ర రాజధానిని పిల్లికాపురంలా మార్చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎపుడు నిర్వహించినా పోటీకి సన్నద్ధమే అని పోలిట్‌బ్యూరో పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై రామమోహనరావు అధ్యక్షతన గతంలో నియమించిన కమిటీ తమ నివేదికను పోలిట్‌బ్యూరోకు అందించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సంఖ్యను విస్తృత పరచాలని పోలిట్‌బ్యూరో నిర్ణయించింది.