రాష్ట్రీయం

ఆర్టీసీ నష్టానికి కేసీఆరే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆర్టీసీ నష్టాలకు ముఖ్యమంత్రి కారణమని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ కేసీఆర్ నిర్ణయాల వల్ల గత 15 రోజులుగా తెలంగాణ తీవ్ర నష్టానికి గురవుతోందని అన్నారు. ఈ నష్టాలను కేసీఆర్ పూడుస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ సెల్ఫ్ డిస్మిస్ సీఎంగా చరిత్రకెక్కారని అన్నారు. పిల్లలకు సెలవులు ఎందుకు ఇస్తున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇన్ని కష్టాలకు బాధ్యుడు ఒక్క బాధ్యతారాహిత్యపు వ్యక్తి వల్లనేనని పేర్కొన్నారు. తాత్కాలిక డ్రైవర్లతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, సమస్యలు తీర్చమని కేసీఆర్‌ను ఎన్నుకుంటే కొత్త సమస్యలు తీసుకొచ్చారని అన్నారు. చర్చలు జరపడానికి కేసీఆర్‌కి ఏం కడుపునొప్పి అని ప్రశ్నించారు. కొత్త సమస్యలు ఎలా క్రియేట్ చేయాలో ఆలోచించడానికే ఫామ్ హౌస్‌లోకి వెళ్లారని అన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయిందని, కేసీఆర్ ఎస్కేపిస్టు ధోరణిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులపై పగపట్టినట్టు వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ కార్మికులపై ప్రజావ్యతిరేకత పెంచడానికే కేసీఆర్ ఈ సమస్యలను పరిష్కరించడం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపే నాయకుడికి పట్టువిడుపులు ఉండాలని అన్నారు. కార్మిక సంఘాలతో వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని బీజేపీ కోరింది. కాంగ్రెస్ చేస్తోన్న ప్రగతి భవన్ ముట్టడి ఒక డ్రామా అనిపిస్తోందని అన్నారు. ఉత్తమకుమార్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడా వాళ్ల సతీమణికి స్టార్ క్యాంపెయినరా అని ప్రశ్నించారు. 16 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కూ ఏదో ఒక డీల్ కుదిరినట్టు అనిపిస్తోందని అన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు ఎందుకు జరపడం లేదో సీఎం వివరణ ఇవ్వాలని కోరారు.