రాష్ట్రీయం

గెలుపు గులాబీదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితినే విజయం సాధించబోతుందని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వివిధ సంస్థలు ప్రకటించాయి. పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా టీఆర్‌ఎస్‌యే గెలవబోతోందని ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. హుజూర్‌నగర్‌లో తమ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గౌరవప్రదమైన మెజార్టీ సాధించబోతున్నట్టు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల నుంచి అందిన సమాచారం ప్రకారం తమ అభ్యర్థి సైదిరెడ్డి విజయం ఖాయమని ఆయన పేర్కొన్నారు. నెల రోజులుగా క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థి విజయం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలావుండగా మిషన్ చాణక్య సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ 53.73 శాతం, కాంగ్రెస్ 41.04 శాతం, టీడీపీ 2.21 శాతం, బీజేపీ 1.17 శాతం, ఇతరులు 1.84 శాతం ఓట్లు సాధించనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా ‘ఆరా’ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్‌ఎస్ 50.48 శాతం, కాంగ్రెస్ 39.95 శాతం, ఇతరులు 9.57 శాతం ఓట్లు సాధించనున్నట్టు పేర్కొంది. టీఆర్‌ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున పద్మావతిరెడ్డి, టీడీపీ తరఫున చావా కిరణ్మయి, బీజేపీ తరఫున కోట రామారావు బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు ఈ నెల 24న జరగనుంది.

*చిత్రం... టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు