రాష్ట్రీయం

డెంగ్యూతో ఖమ్మం జడ్జి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్: డెంగ్యూ వ్యాధి బారిన పడి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ జడ్జి మృతి చెందారు. ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ఎం.జయమ్మ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం ఇటీవలే మినిష్టర్ రోడ్డులోని కిమ్స్ ఆసుపత్రిలో చేరడంతో డెంగ్యూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్థారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయమ్మ సోమవారం తెల్లవారుజాము రెండు గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు నిర్థారించారు. హైకోర్టు విభజనలో భాగంగా సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. గత డిసెంబర్‌లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు.

*చిత్రం... ఎం.జయమ్మ(ఫైల్‌ఫొటో)