రాష్ట్రీయం

40 లక్షల బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: దేశ, సమాజ శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, విధుల పట్ల అంకితభావంతో పనిచేసే పోలీసులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలీసు అమరవీరుల దినోత్సవం నాడు ఓ చారిత్రాత్మక ఒప్పందానికి పోలీసుశాఖ శ్రీకారం
చుట్టింది. యాక్సిస్ బ్యాంకుతో పోలీసులకు బీమా సౌకర్యం కల్పిస్తూ ఒప్పందాన్ని ఖరారు చేసింది. సోమవారం ఈ మేరకు మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ఎంఓయూపై సంతకాలు చేసి యాక్సిస్ బ్యాంకు ప్రతినిధులకు ఒప్పంద పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది, ప్రమాదాలు, హింసాత్మక చర్యల వల్ల అకాల మరణం పొందినా, శాశ్వతంగా గాయపడినా అలాంటి వారికి రూ.30 లక్షలు, ఉగ్రవాదం కారణంగా అమరుడైతే అదనంగా రూ.10 లక్షలు కలిపి మొత్తంగా 40 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఇదే ప్రయోజనం పదవీ విరమణ తర్వాత కూడా వారికి కొనసాగే విధంగా ఏర్పాట్లు చేశామని, ఇది సంక్షేమ ప్రయోజన ఫలాల్లోకెల్లా అత్యుత్తమమైందని పేర్కొన్నారు. దేశంలోనే మొదటి సారి ఈ ప్రయోజనాన్ని కల్పిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలుస్తుందన్నారు. వీరితో పాటు హోంగార్డులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ మరో ఒప్పందాన్ని యాక్సిస్ బ్యాంక్‌తో కుదుర్చుకున్నట్లు తెలిపారు. సర్వీసులో ఉండి ప్రమాదవశాత్తు మరణించిన హోంగార్డులకు రూ. 30 లక్షలు, ఉగ్రవాద హింసలో హతమైన వారికి అదనగా 10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. యాక్సిస్ బ్యాంకు ద్వారా వ్యక్తిగత వేతన ఖాతాపై అత్యుత్తమ బ్యాంకింగ్ సేవలు అందనున్నాయని పేర్కొన్నారు. డెబిట్‌కార్డు, చెక్‌బుక్‌తో కూడిన జీరో బ్యాలెన్స్ ఖాతాలను పోలీసులకు తెరవనున్నట్లు డీజీపీ తెలిపారు. ఉద్యోగితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి కూడా ఇదేవిధమైన బ్యాంకింగ్ సేవ అందుతుందన్నారు. దురదృష్టవశాత్తు ప్రమాదాల కారణంగా మరణించిన పోలీసుల కుటుంబాల్లోకి పిల్లల విద్య కోసం తక్షణం 2 లక్షల రూపాయలు అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. డెబిట్‌కార్డు ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుకు సిబ్బందికి రూ.50 వేల వరకు అవకాశం ఉంటుందన్నారు. ఉచిత నగదు బట్వాడా సదుపాయాన్ని కూడా కల్పించేందుకు బ్యాంకు ప్రతినిధులు అంగీకరించారని తెలిపారు. ఆర్థిక సంస్థల నుండి వచ్చే ఇటువంటి సదుపాయాలు సిబ్బంది మనోధైర్యం, సమాజం పట్ల నిబద్ధత పెంచి మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించేందుకు దోహదపడతాయని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు అమిత్‌గార్గ్, రవిశంకర్ అయ్యన్నార్, మహేష్‌చంద్ర లడ్హా తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో యాక్సిస్ ఏటీఎంను సవాంగ్ ప్రారంభించారు. డీజీపీ కార్యాలయ ఉద్యోగులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఏటీఎం ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు.
*చిత్రం...యాక్సిస్ బ్యాంకు ప్రతినిధులకు ఎంఓయూ పత్రాలు అందజేస్తున్న డీజీపీ సవాంగ్