రాష్ట్రీయం

పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 22: పొరుగు రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రంలోకి ధాన్యం తరలి రాకుండా జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ‘చెక్’ పోస్టులు సమర్థవంతంగా పనిచేయాలని, తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ కార్ఖానగడ్డలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ యంత్రంపై ధాన్యాన్ని తూకం వేశారు. తేమ యంత్రం సహాయంతో తేమ శాతాన్ని పరిశీలించారు. 17 శాతం వచ్చేంతవరకు ధాన్యాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభమయ్యాయని, ధాన్యం చేతికొచ్చే సమయంలోనే వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కోత మిషన్లతో ధాన్యాన్ని కోసి నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారని, ఇకపై కల్లాల వద్దనే ఆరబెట్టి విక్రయానికి తీసుకురావాలన్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని, జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించు కోవాలన్నారు. పొరుగు రాష్ట్రాల ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతుల పంట వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉంటాయని, వివరాలు తీసుకునే కొనుగోలు చేయాలన్నారు.