రాష్ట్రీయం

శ్రీశైలానికి భారీగా వరద:పది గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, అక్టోబర్ 23: కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి మరోసారి వరద పోటెత్తింది. దీంతో పది గేట్లు ఎత్తి దిగువ సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. మంగళవారం నుంచే జలాశయానికి ఎగువ నుంచి వరద రాక ప్రారంభం కావడంతో రాత్రి నాలుగు గేట్లు ఎత్తారు. బుధవారం ఉదయానికి వరద మరింత పెరగడంతో మరో ఆరు గేట్లు ఎత్తారు. మొత్తం 10 గేట్లు పది అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటి విడుదలను చేపట్టారు. మధ్యాహ్నానికి వరద మరింత పెరగడంతో గేట్ల ఎత్తును మరో 5 అడుగులు పెంచారు. మొత్తం శ్రీశైలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఏడాదిలో రెండు నెలల్లోనే ఏడు సార్లు గేట్లను ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేయడం విశేషం. ప్రస్తుతం జూరాల నుంచి 3,59,876 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1,78,883 క్యూసెక్కులు కలిపి మొత్తం 5,58,807 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి చేరుతోంది. డ్యామ్ పది గేట్ల ద్వారా 3,78,640 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 26,437 క్యూసెక్కులు, ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు మొత్తం 4,47,457 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రం 7 గంటల సమయానికి జలాశయం నీటిమట్టం 884.80 అడుగులుగా నమోదుకాగా 214.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

*చిత్రం... శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి నీరు విడుదల చేయడంతో సాగర్‌కు ఉరకలేస్తున్న కృష్ణమ్మ