రాష్ట్రీయం

గొంతు ఎండనివ్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: ‘రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వడదెబ్బకు జనం చనిపోతున్నారు. మరోపక్క మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. మంచినీటి వసతికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సుమారు 200 కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యలను పరిష్కరించనున్నట్టు చెప్పారు. సోమవారం ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. మంచినీటి సమస్యపై విపులంగా చర్చించారు. ఆ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విలేఖరులకు తెలిపారు. ఎండాకాలంలో గతంలో నాలుగు వేల వాహనాల్లో ప్రజలకు నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉండేదని, ఈ ఏడాది అనేక ప్రాంతాల్లో నీటి వసతి కల్పించినందున 563 వాహనాలతో మంచినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత ఏడాదికన్నా భూగర్భ జలాలు ఒక మీటరు పైకి పెరిగాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో బోరుబావులను మరింత లోతుకు తవ్వుతున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో బోర్లకు మరమ్మతులు చేయించామన్నారు. రాష్ట్రంలో వడదెబ్బకు మరణాలు పెరిగిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కార్యాచరణను రూపొందించామని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య జనాన్ని బయటకు రాకుండా చూస్తామని, దీనిపై అవగాహన కల్పించడానికి ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ప్రతిచోటా వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇందులో ముగ్గురు పార్టీ నుంచి ఉంటారని, వారు జిల్లా మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులతో కలిసి అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎండల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తారని వివరించారు. ప్రజలకు సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉపాధి కూలీలకు వడదెబ్బ తగలకుండా ఉండేందుకు అవసరమైతే వారి పనివేళల్లో మార్పులు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. వారు పనిచేసేచోట మంచినీరు, మజ్జిగను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. అలాగే రోడ్ల మీద వెళ్లే జనానికి ఎక్కడికక్కడ మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను అందించేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం జిల్లాకు మూడు కోట్ల రూపాయల చొప్పున కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో 7,232 చలివేంద్రాలను ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు.
రాష్ట్ర మంత్రివర్గం వివిధ సంస్థలకు భూములు, స్థలాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. హీరో మోటార్స్‌కు ఎకరా లక్ష రూపాయల చొప్పున 600 ఎకరాలను, యాక్సిలరీ యూనిట్స్‌కు ఎకరా 10 లక్షల చొప్పున కేటాయించామని, ఈ సంస్థ 3,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిందని మంత్రివర్గం తెలిపింది. దీనివల్ల 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అర్జున అవార్డు గ్రహీత శీరా జయరాంకు విశాఖ జిల్లా ఎండాడలో 500 గజాల స్థలాన్ని కేటాయించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో రెవెన్యూ గెస్ట్‌హౌస్ నిర్మాణానికి 10 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. గుంటూరు జిల్లాలోని కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్, వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ నిర్మించడానికి 16.45 ఎకరాల భూమి ఉచితంగా కేటాయించారు.
తిరుపతిలో మహానాడుకు
బాబుపై మంత్రుల ఒత్తిడి!
ఈ సంవత్సరం మహానాడును తిరుపతిలో నిర్వహించాలని సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మెజార్టీ మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. మహానాడును తిరుపతిలోనా, విజయవాడలో నిర్వహించాలా అనే చర్చ వచ్చిప్పుడు తిరుపతిలోనే నిర్వహించాలని మెజార్టీ మంత్రులు చెప్పారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

చిత్రం విజయవాడలో సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం దృశ్యం