రాష్ట్రీయం

శ్రీశైల మల్లన్న సేవలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ బుధవారం శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. శ్రీస్వామి అమ్మవార్ల దర్శనార్థమై వచ్చిన ఆయనకు ఆలయ రాజగోపురం వద్ద ఈఓ రామారావు, అర్చకులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకున్న భగవత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు మోహన్ భగవత్‌కు ఆశీర్వచనాలు అందించగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు శ్రీస్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. అనంతరం దేవస్థానం పరిధిలోని నక్షత్ర వనంలో మోహన్ భగవత్ మొక్కలు నాటారు.
*చిత్రం...ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శ్రీశైల మల్లన్న, భ్రమరాంబిక అమ్మవారల చిత్రపటాన్ని అందజేస్తున్న ఈఓ రామారావు