రాష్ట్రీయం

ప్లీనరీ కన్నా ముందే పదవుల పంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: టిఆర్‌ఎస్ ప్లీనరీ కన్నా ముందే పదవుల పంపకం జరుగుతుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈనెల 27న ఖమ్మంలో జరిగే టిఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్ల గురించి హోంమంత్రి నాయిని తెలంగాణ భవన్‌లో సోమవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు, రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణం, ఇంటింటికి నల్లా నీళ్లు, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్ రూమ్ వంటి కీలక పథకాల గురించి ప్లీనరీలో చర్చిస్తారు. 27న ఖమ్మంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ జరుగుతుంది. ప్లీనరీ పోస్టర్‌ను నాయిని నర్సింహారెడ్డితో పాటు పార్టీ నాయకులు సోమవారం తెలంగాణ భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయిని ప్లీనరీ ఏర్పాట్లు వివరించారు. కేంద్రం నుండి కరవు నిధులు ఆశించిన స్థాయిలో రాలేదని నాయిని తెలిపారు. కరవు సహాయ చర్యలు చేపట్టడం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, రాష్ట్రంలో జరుగుతున్నది కేంద్ర మంత్రికి తెలియదని అన్నారు. దత్తాత్రేయ హైదరాబాద్, ఢిల్లీల మధ్య తిరుగుతారని అన్నారు. తాను రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2014 ఎన్నికల్లో నేటు పోటీ చేయలేను అన్నాను, కెసిఆర్ మండలి సభ్యత్వం కల్పించి మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ముఖ్యమంత్రి ఏం చెబితే అది చేస్తాను అన్నారు.

చిత్రం టిఆర్‌ఎస్ ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరించిన హోంమంత్రి నాయని, ఇతర నేతలు