రాష్ట్రీయం

వాణిజ్య పన్నుల్లో టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18:రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులనూ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులుగా మార్చాలని ప్రభు త్వం నిర్ణయించింది. విధి విధానాలు రూపొందించేందుకు వాణిజ్య పన్నుల శాఖ, రవాణా శాఖ, వ్యవసాయ,మైన్స్, పౌర సరఫరా శాఖ, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జీరో వ్యాపారాన్ని కట్టుదిట్టంగా అడ్డుకుంటున్నట్టు చెప్పారు. 2015-16 సంవత్సరం వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యం 33,965 కోట్లు కాగా, 32,492 కోట్ల రూపాయల పన్ను వసూలు చేసినట్టు చెప్పారు. 96 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు, 17.85 శాతం వృద్ధి రేటు సాధించినట్టు చెప్పారు. వృద్ధి రేటులో దేశంలో బీహార్ తరువాత తెలంగాణ రెండవ స్థానంలో నిలిచిందని అన్నారు. పన్ను ఎగవేతను అరికట్టేందుకు తీసుకున్న అనేక చర్యలు ఫలించి వసూళ్లు పెరిగాయని తెలిపారు. ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగంలో ఒక అదనపు యస్‌పితో పాటు 138 మంది హోంగార్డులను నియమించడం వంటి పాలనా సంస్కరణలు ఉపయోగపడ్డాయని అన్నారు. పన్ను లీకేజీని అరికట్టేందుకు ఇన్‌ఫార్మర్మకు 10వేల నుండి 50వేల వరకు రివార్డును పెంచినట్టు చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖను మరింత బలోపేతం చేసేందుకు మూడు కోట్లతో 25 ఇన్నోవా వాహనాలు కొనుగోలు చేసినట్టు చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక డిప్యూటీ కమీషనర్‌ను నియమించడంతో పాటు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని డివిజన్లలో అదనంగా మరి కొందరు డిప్యూటీ కమీషనర్లను నియమించనున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా సినిమా టికెట్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రావలసిన ఆదాయం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. వాణిజ్య శాఖలోని ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. చెక్ పోస్టుల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పని చేసేందుకు 140 మంది హోంగార్డులను నియమించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు మొదలైన నియామకాలు జరుగుతాయని చెప్పారు.