రాష్ట్రీయం

కనకవర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టిని సాధించింది. ఆదాయం అంచనాలకు మించి నిధులు సమకూరుతున్నాయి. రెవిన్యూ రాబడిలో వందకు వందశాతం లక్ష్యాలను చేరుకుంటోంది. రాష్ట్రానికి నిధుల సమీకరణలో వాణిజ్యపన్నుల శాఖ అగ్రస్థానంలో నిలువగా, ఆ తర్వాత స్థానాలను ఎక్సైజు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ పొందాయి. రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్న నీటిపారుదలశాఖ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి ఆర్థిక సంస్థల నుంచి రుణాలను పొందుతుండటంతో ప్రభుత్వ ఇతర ప్రాధాన్యతా కార్యక్రమాలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరతలేని విధంగా ఖజానాకు నిధులు వెల్లువలా సమకూరుతున్నాయి. రాష్ట్ర ఆదాయంలో సింహభాగం నిధులు వాణిజ్య పన్నుల ద్వారా సమకూరుతున్నాయి. వాణిజ్య పన్నుల వసూళ్ళ వల్ల రాష్ట్ర ఆదాయంలో 15 శాతం వృద్ధి నమోదు అయింది. బిహార్ తర్వాత ఆర్థిక వృద్ధి అధికంగా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా నిలవడం ఇది రెండవసారి. రుణ పరిమితిని 0.5 శాతం పెంచడంతో రాష్ట్రానికి అదనంగా రూ. 2300 కోట్లు అదనపు రుణం పొందడానికి అవకాశం లభించింది. ఇప్పటికే కేంద్ర పన్నులో రాష్ట్ర వాటాగా రూ. 13 వేల కోట్లు కాగా, ఎఫ్‌ఆర్‌బిఎం శాతం పెరగడంతో ఈ నిధులు రూ. 15 వేల కోట్ల వరకు చేరుకోబోతున్నాయి. ఏటా వాణిజ్య పన్నుల రాబడి దాదాపు రూ. 10 వేల కోట్లు పెరుగుతూ వస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ తర్వాత రాష్ట్ర ఖజానాకు ఎక్సైజు శాఖ ద్వారా నెలకు వెయ్యి కోట్ల చొప్పున ఆదాయం సమకూరుతోంది. నిరుడు ఎక్సైజుశాఖ ద్వారా రూ. 11 వేల కోట్లు వస్తుందని అంచన వేయగా, అంచనాలకు మించి రూ. 12 వేల కోట్ల పై చిలుకు ఆదాయం ఈ మార్చి నెలాఖారుకు సమకూరింది. ఈ రెండు శాఖల తర్వాత ప్రధాన ఆదాయ వనరులలో ఒకటైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు మార్చి నాటికి (2015-16) ఆర్థిక సంవత్సరానికి రూ. 3750 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయానికంటే 24 శాతం ఎక్కువ. రాష్ట్ర ఖజానాను నింపుకోవడానికి మరో కొత్త ఆదాయ వనరును కూడా ప్రభుత్వం సృష్టించుకుంది. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ నిరర్ధక భూములను విక్రయించడం ద్వారా ఖజానాకు రూ. 14 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో పడింది. ప్రభుత్వం అంచనా వేసినట్టుగా జరిగితే రాష్ట్ర వార్షిక ఆదాయం ఈసారి 60 నుంచి 65 వేల కోట్లకు చేరుకోనుంది. ఇది ప్రణాళిక వ్యయానికి దాదాపు సమానం కానుంది. వాణిజ్య పన్నుల ద్వారా రూ. 32,492 కోట్లు, ఎక్సైజుశాఖ ద్వారా రూ. 12 వేల కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 13 వేల కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ద్వారా రూ. 3750 కోట్లు, భూముల అమ్మకం ద్వారా రూ. 14 వేల కోట్లతో రాష్ట్ర ఖజానా ఈసారి కళ కళలాడబోతోంది.