రాష్ట్రీయం

టీఆర్టీ ఎస్‌జీటీ పోస్టుల ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: టీఆర్టీ ఆంగ్ల మాద్యమం ఎస్‌జీటీ పోస్టుల ఫలితాలను శనివారం నాడు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో 909 పోస్టులకు 843 మంది ఎంపికయ్యారని సర్వీసు కమిషన్ పేర్కొంది. అక్టోబర్ 11న 3786 టీఆర్టీ తెలుగు మీడియం పోస్టులను భర్తీ చేశామని తాజాగా 843 టీఆర్టీ ఆంగ్ల మాద్యమం పోస్టులను భర్తీ చేశామని, 20 రోజుల వ్యవధిలో దాదాపు ఐదు వేలు పోస్టులను భర్తీ చేయడం ఆనందంగా ఉందని సర్వీసు కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి తెలిపారు. మరో టీఆర్టీ ఆంగ్ల మాద్యమంలో మరో ఐదు పోస్టులను కోర్టు ఆదేశాలతో విత్‌హెల్డ్‌లో పెట్టామని అన్నారు. పీహెచ్ కోటాలోని 39 పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని, అలాగే మరో 21 పోస్టులను ఇతర సాంకేతిక కారణాలతో భర్తీ చేయలేదని, త్వరలో భర్తీ చేస్తామని అయితే ఒక పోస్టును అర్హులు లేక భర్తీ చేయలేదని కమిషన్ కార్యదర్శి ఏ వాణీ ప్రసాద్ చెప్పారు.
గ్రూప్-2 అభ్యర్థుల
జాబితా విడుదల
నోటిఫికేషన్ నెంబర్ 20/2015, 17/2016లకు అనుగుణంగా నిర్వహించిన గ్రూప్-2 ఎంపిక పరీక్షలో 1032 పోస్టులకు గానూ 2064 మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించామని, ఇంటర్వ్యూలకు 2028 మంది హాజరయ్యారని కమిషన్ కార్యదర్శి వాణీ ప్రసాద్ చెప్పారు. వారి మార్కుల జాబితాలను కమిషన్ వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని చెప్పారు. మొత్తం మార్కుల జాబితాలను నియామకాల ప్రక్రియ పూర్తయిన నెల రోజులకు విడుదల చేస్తామని తెలిపారు.
గ్రూప్-2 ఫలితాల్లో అన్యాయం
గ్రూప్-2 ఫలితాల్లో మెరిట్ అభ్యర్ధులకు అన్యాయం జరిగిందని కొంత మంది వాపోతున్నారు. పరీక్షల సమయంలో పార్టు బీలో ఒఎంఆర్ షీట్‌లలో వైట్నర్ వాడిన అభ్యర్ధులను ఎంపిక చేయవద్దని సాంకేతిక కమిటీ, కోర్టు చెప్పినా ఎంపిక చేయడం అక్రమమని వారు పేర్కొంటున్నారు. 483 మార్కులు మెరిట్ ఉండి కూడా కొంత మందికి జాబ్ రాలేదని, ఇంటర్వ్యూల మార్కులతో పాటు మొత్తం మార్కులు, మెరిట్ జాబితాలను బహిరంగపరచాలని వారు కోరుతున్నారు. పారద ర్శకత అవసరమని పేర్కొన్నారు.