రాష్ట్రీయం

రైల్వేల ప్రైవేటీకరణకు ఆర్‌ఎస్‌ఎస్ అడ్డంకి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారతీయ రైల్వే లో కొన్ని రైలు మార్గాలను ప్రైవేటీకరించడానికి కేంద్రం పచ్చజెండా ఊపడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అడ్డు చెబుతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దేశంలో 150 మార్గాల్లో నడిచే రైళ్లను ప్రైవేటీకరించడానికి రైల్వే బోర్డు వౌఖిక ఆదేశాలు ఇచ్చింది. రైళ్లను ప్రైవేటీకరించడం ద్వారా ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలను ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేస్తాయని రైల్వే బోర్డు అభిప్రాయపడుతోంది. అయితే, రైల్వేలను అభివృద్ధి చేయడానికి
ప్రైవేటీకరణ మంచిదే కానీ సామాన్య, పేద ప్రజలు అంత ఖరీదైన టికెట్లు కొనుగోలు చేయలేరని ఆర్‌ఎస్‌ఎస్ వాదిస్తోంది. రైల్వేలో ఎక్కువ మంది ప్రయాణికులు మధ్య తరగతి, సామాన్య, పేద వర్గాలేనని ఆర్‌ఎస్‌ఎస్ గుర్తు చేస్తోంది. రైల్వేలను ప్రైవేటీకరించడానికి కేంద్రం తీసుకున్న విధానాలపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్ అంతర్గత సర్వేలు చేపట్టిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వేల ప్రైవేటీకరణపై భాజపా ప్రభుత్వాలు సుముఖంగా లేవన్న సమాచారం వచ్చినుట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన మంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్‌లో రైల్వేల ప్రైవేటీకరణపై భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు స్పష్టమైన నివేదికను కేంద్ర హోంమంత్రికి ఆర్‌ఎస్‌ఎస్ నివేదించినట్లు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం రైల్వేల ప్రైవేటీకరణపై ప్రజల నుంచి విమర్శలు ఉన్నట్లు గుర్తు చేస్తోంది. రైల్వేను ప్రైవేటీకరించడం ద్వారా మధ్య తరగతి, సామాన్య, పేద వర్గాలు బీజేపీకి దూరం అవుతారని ఆర్‌ఎస్‌ఎస్ సర్వేలో బయటపడింది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రైళ్ల ప్రైవేటీకరణకు సంబంధించిన నివేదికను ఆర్‌ఎస్‌ఎస్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సమర్పించినట్లు రైల్వే వర్గాలు గుర్తు చేశాయి. దీంతో రైల్వేలను ప్రైవేటీకరించడానికి కేంద్రం ఆచితూచి అడుగువేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.