రాష్ట్రీయం

మాట నిలబెట్టుకున్న సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 6: వారంలోపు తనను ఆలయ ప్రధానార్చకులుగా నియమిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు హామీ ఇచ్చారని, అందుకే ఆగమ సలహాదారుగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు డాక్టర్ రమణదీక్షితులు తెలిపారు. గత యేడాది జూన్ మాసంలో రమణదీక్షితులను ఆలయ ప్రధానార్చకుల విధుల నుంచి టీటీడీ ఆకస్మికంగా తొలగించి ఉద్యోగవిరమణ ఇచ్చిన విషయం పాఠకులకు విదితమే. అనంతరం డాక్టర్ రమణదీక్షితులు పలుమార్లు విలేఖరుల ముందుకు వచ్చినా గత కొంతకాలంగా వౌనం వహిస్తూవచ్చారు. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులను ఆగమ సలహాదారుగా నియమిస్తూ టీటీడీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ అర్చకులకు 65 సంవత్సరాల వయోపరిమితికే విధుల నుంచి తప్పుకోవాలని ఆగమ శాస్త్రాల్లో కానీ, చట్టంలోకానీ నిబంధన ఏదీ లేదన్నారు. గత టీడీపీ కొత్తచట్టాన్ని అర్చకులను బలవంతంగా ఉద్యోగ విరమణ ఇప్పించారన్నారు. శ్రీవారికి అనాదికాలం నుంచి 4 కుటుంబాలు అర్చకులు స్వామివారి కైంకర్యాలను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తూ వచ్చారన్నారు. 1987లో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దుచేస్తూ అప్పటి ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందన్నారు. దీంతో వేలాదిమంది అర్చక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. అయితే 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చట్ట సవరణ చేసి వంశపారంపర్య హక్కులను అర్చకులకు కల్పించాలన్నారు. అయితే తాజాగా టీటీడీ అర్చకులకు ఉద్యోగవిరమణ ప్రకటించిందన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అర్చకులకు ఉద్యోగ విరమణ విధానాన్ని రద్దుచేసి మాట నిలబెట్టుకున్నారన్నారు. తనతోపాటు ఇతర వంశపారంపర్య
అర్చకులకు గతంలో లాగానే యధాస్థానాన్ని తిరిగి కేటాయిస్తారని టీటీడీ కూడా హామీ ఇచ్చిందన్నారు. అందుకేతాను ఆగమ సలహామండలి సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారన్నారు. బ్రాహ్మణులు అర్చకుల సంక్షేమార్థం జగన్ అమలుచేస్తున్న కార్యక్రమాలు హర్షణీయం అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయన మంచి సుపరిపాలన అందిస్తున్నారని, రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా జలాశయాలు కూడా పరిపూర్ణంగా నిండటం ద్వారా భగవంతుని ఆశీస్సులు కూడా జగన్‌కు ఉన్న విషయం తేట తెల్లమైందన్నారు. మరో 30 సంవత్సరాలు జగన్ సీ ఎంగా ఉండాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నారన్నారు.

*చిత్రం... తిరుపతిలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతున్న టీటీడీ ఆగమ సలహాదారు రమణ దీక్షితులు