రాష్ట్రీయం

బంగాళాఖాతంలో బుల్‌బుల్ వాయుగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 6: తూర్పు మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. ఇది ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 810 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రాగల 12 గంటల్లో తుపానుగాను, తదనంతరం మరో 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగాను బలపడే అవకాశం ఉందని తెలిపారు. తుపానుకు బుల్‌బుల్‌గా నామకరణం చేశారు. ఆగ్నేయ దిశగా కొంత దూరం ప్రయాణించిన అనంతరం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. బుల్‌బుల్ తుపాను ప్రభావంతో అన్ని ప్రధాన పోర్టుల్లోనూ 1 వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగుర వేశారు. కాకినాడలో 3వ నెంబర్, గంగవరం పోర్టులో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాను ప్రభావంతో సముద్రం కల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.