రాష్ట్రీయం

కారా మాస్టారుకు గీతం డీలిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 6: ప్రఖ్యాత రచయిత, సాహితీవేత్త కాళీపట్నం రామారావు (కారా మాస్టారు)కు గీతం డీమ్డ్ యూనివర్శిటీ డాక్టర్ ఆప్ లిటరసీ (డీలిట్) గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆయనతో పాటు రక్షణ రంగ శాస్తవ్రేత్త, ఇస్రో చైర్ ప్రొఫెసర్ డాక్టర్ వీ భుజంగరావు, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆదినారాయణ రావుకు డాక్టర్ ఆఫ్ సైన్స్ (డీఎస్సీ) పేరిట గౌరవ డాక్టరేట్‌లను ఇవ్వనున్నారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ 10వ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9న విశాఖలోని గీతం క్యాంపస్‌లో జరిగే కార్యక్రమంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్ ప్రొఫెసర్ సహస్రబుదే చేతుల మీదుగా అతిధులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు గీతం వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ బుధవారం విశాఖలో తెలిపారు. స్నాతకోత్సవం సందర్భంగా గీతం ఇంజనీరింగ్, ఫార్మశీ, ఆర్కిటెక్చర్, లా, సైన్స్, ఎంబీఏ, బీబీఎం, ఇంటర్నేషనల్ బిజినెస్, బీఏ సోషల్ సైన్స్, ఎంఏ సైకాలజీ, ఇంగ్లీష్ కోర్సులు పూర్తి చేసిన 2000 మంది పట్ట్భద్రులు, పీహెచ్‌డీ డిగ్రీలు అందుకున్న వారికి స్నాతకోత్సవ పట్టాలు అందజేయనున్నట్టు తెలిపారు.
ఉత్తరాంధ్రకు చెందిన కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) రచయితగా, సాహితీవేత్తగా చిరపరిచితులు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (1995) సహా పలు సాహిత్య అవార్డులు అందుకున్న కారా శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. కారా మాస్టారి పలు రచనలు వివిధ భాషల్లోకి అనువాదమై ఆయనకు జాతీయ ఖ్యాతినార్జించిపెట్టాయి. సమాజంలోని ప్రజల సమస్యలే ఇతివృత్తంగా కారా మాస్టారు రచనలు చేసేవారు. ఆయన రచించిన ‘యజ్ఞం’ వంటి కథలు ఎంతో పేరుప్రతిష్టలను తెచ్చిపెట్టాయి. విశాఖ రచయితీల సంఘం, విప్లవ రచయితల సంఘం (విరసం)కు వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరిస్తూ శ్రీకాకుళంలో ‘కథానిలయం’ పేరిట అభ్యుదయ రచయితలను ప్రోత్సహిస్తున్నారు.

భుజంగరావు
రక్షణ రంగ పరిశోధనల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ భుజంగరావు ప్రస్తుతం ఇస్రో చైర్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్‌గా, నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్ డైరెక్టర్ జనరల్‌గా, చీఫ్ కంట్రోలర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. యుద్ధ నౌకల సాంకేతిక పరిజ్ఞానం అంశంలో ఎంతో అనుభవం ఉన్న భుజంగరావు ఎకోస్టికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కండిషన్ మానిటరింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి సంస్థలకు అధ్యక్షునిగా పనిచేశారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు అకడమిక్ కౌన్సిల్ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు.

ఆదినారాయణ
వైద్య రం గంలో డాక్టర్ ఆదినారాయణ రావు విశేష సేవలందించారు. ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్‌గా, ఫ్రీ పోలియో సర్జికల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా, ప్రేమ ఆసుపత్రి డైరెక్టర్ జనరల్‌గా ఆదినారాయణ రావు ఆంధ్ర వైద్య కళాశాల, ఉస్మానియా వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 20కి పైగా పరిశోధన పత్రాలు వెలువరించారు. ఆర్థోపెడిక్ వైద్యంలో 38 మంది సర్జన్లకు శిక్షణ ఇచ్చిన ఆదినారాయణ రావు పలు జాతీయ అవార్డులతో పాటు 100పైగా అవార్డులతో సత్కరించారు.
*చిత్రాలు.. కాళీపట్నం రామారావు
*డాక్టర్ భుజంగరావు
* డాక్టర్ ఆదినారాయణ రావు