రాష్ట్రీయం

కొత్త రోడ్ల వ్యయంలో అధిక భాగాన్ని కేంద్రం భరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద చేపట్టే కొత్త రోడ్ల నిర్మాణ వ్యయంలో అధిక భాగాన్ని కేంద్రం భరించాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. కేంద్రం 90 శాతం నిధులు, రాష్ట్రం 10 శాతం వ్యయాన్ని భరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనపై (పీఎంజీఎస్‌వై) హరిత ప్లాజాలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జనరల్ అల్కా ఉపాధ్యాయ, డైరెక్టర్లు సురభిరాయ్, బీసీ ప్రధాన్, ఉత్తమ్‌కుమార్ హాజరై దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పీఎంజీఎస్‌వై మూడవ దశ అమలును సమీక్షించారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా (పీఎంజీఎస్‌వై) కింద కొత్త రోడ్ల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి. కాగా, తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటు కావడంతో పీఎంజీఎస్‌వై కింద చేపట్టే మూడవ దశలో రోడ్లలో ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మూడవ దశలో 2019-20లో తెలంగాణ రాష్ట్రానికి 2,427 కిలోమీటర్ల రోడ్లను మంజూరు చేసిందని, దీనిని 4 వేల కిలో మీటర్లకు పెంచాలని మంత్రి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో ఆవాసాలపై కేంద్రానికి సమైక్య రాష్ట్రంలో తప్పుడు లెక్కలు సమర్పించిందని ఆయన ఫిర్యాదు చేశారు. అప్పుట్లో జరిగిన నష్టాన్ని ఎక్కువ కిలోమీటర్లు మంజూరు చేయడం ద్వారా పూడ్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన రోడ్లకు అదనంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన సందర్భంగా కోరారని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేశారు. పీఎంఎస్‌వై కింద మూడవ దశలో చేపట్టనున్న రోడ్ల ప్రతిపాదనలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జనరల్ అల్కా ఉపాధ్యాయకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అందజేశారు.