రాష్ట్రీయం

టిటిడి బోర్డు పదవీకాలం పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీ కాలాన్ని మరో సంవత్సరంపాటు పొడిగించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సాధారణంగా ఈ బోర్డు పదవీకాలం రెండేళ్లు ఉండాలని, ప్రస్తుత పాలక మండలిని ఒక సంవత్సరానికి మాత్రమే నియమించామని, అయితే మరో సంవత్సరం పొడిగించనున్నట్టు ఆయన విలేఖర్ల సమావేశంలో ప్రకటించారు. కాగా రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. 10 ఎకరాల్లోపు ఏర్పాటు చేయనున్న పర్యాటక ప్రాజెక్ట్‌కు భూముల కేటాయింపులో నిబంధనలను సరళతరం చేస్తున్నట్టు చెప్పారు. భారీ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేసుకునేవారికి భూములను టెండర్లు పిలిచి కేటాయిస్తామన్నారు. ఆ భూమి మార్కెట్ విలువలో రెండు శాతం మొత్తాన్ని బిడ్‌గా నిర్ణయించి వేలం వేస్తామని, ఎవరు ఎక్కువ ధరకు పాడితే వారికి ఆ భూమిని 35 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తామన్నారు.
పాడి పరిశ్రమాభివృద్ధికి ప్రణాళిక
రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈమేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన మీడియాకు తెలిపారు. డెయిరీలు ఏర్పాటు చేయడానికి చాలామంది రైతులు ముందుకు వస్తున్నారన్నారు. వీరికి ముఖ్యంగా ఎండు, పచ్చిగడ్డి కావాల్సి ఉంటుందన్నారు. మొక్కజొన్న నుంచి గడ్డిని తయారుచేసే విధానం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. గడ్డి కొరతను నివారించేందుకు రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతిచోటా 50 నుంచి 100 ఎకరాలను ఎంపిక చేసి గడ్డి పండిస్తామన్నారు. గడ్డి పండించే రైతులకు సబ్సిడీ ఇస్తామని తెలిపారు. పండించిన గడ్డిని డెయిరీ రైతులకు సగం ధరకే విక్రయించాల్సి ఉంటుందన్నారు.