రాష్ట్రీయం

అభివృద్ధికి కదలిరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 8: మెరుగైన రాష్ట్రం కోసం.. ఎంతో కొంత మంచి చేసేందుకు ఖండాంతరాల్లో ఉన్న వారంతా కదలి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. క్యాంప్ కార్యాలయంలో ‘కనెక్ట్ టు ఆంధ్ర’ వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఎస్ చైర్మన్‌గా ఏర్పాటైన ‘కనెక్ట్ టు ఆంధ్ర’ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు దేశ, విదేశాల్లోని తెలుగువారి సహకారం కోసం పనిచేస్తుంది. సంస్థ వెబ్‌పోర్టల్ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రవాసాంధ్రులకు సందేశం పంపారు. ‘రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చాటుకునేందుకు ఇదో మంచి అవకాశమ’న్నారు. మీరు ఎంత సహాయం చేస్తారనేది ముఖ్యం కాదు.. మీ గ్రామం..మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమమైనా చేపట్టవచ్చు.. ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో పురపాలకశాఖ కమిషనర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్, ప్రణాళిక శాఖ డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్‌ఆర్టీ చైర్మన్ వెంకట్ పాల్గొన్నారు.