రాష్ట్రీయం

పది రోజుల్లో పీఆర్సీ నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నెలల తరబడి వేతన సవరణ సంఘం నివేదిక కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వచ్చే పది నుంచి పనె్నండు రోజుల్లోగా పీఆర్‌సీ కమిషన్ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పీఆర్‌సీ అంటే వేతన సవరణ సంఘం. ఈ సంఘాన్ని 2018 మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2018 జూలై 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అమలులోకి రావాల్సి ఉంది. ఏడాదిన్నరగా వేతనాల పెంపుపై కమిషన్ అధ్యయనం చేస్తోంది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్, మరో ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ను ప్రభుత్వం గత ఏడాది నియమించింది. ఈ కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే అమలు చేస్తామని గత ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. నెలల తరబడి ఎన్నికల కోడ్ అమలులో ఉండేది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమ డిమాండ్లను వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరలోనే తీపి వార్త వెలువడుతుందని ఓపిక పట్టాలని వారిని కోరారు. రాష్ట్రంలో 3.5 లక్షల నుంచి 4లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం రెండు డీఏలను కూడా ఉద్యోగులకు ప్రకటించింది.