రాష్ట్రీయం

జర్నలిస్టులకు ఆదర్శం రాఘవాచారి జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: చక్రవర్తి రాఘవాచారి జీవితం నేటి జర్నలిస్టులకు స్ఫూర్తినిస్తుందని, ఆదర్శంగా ఉంటుందని పలువురు సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియూడబ్ల్యుజే) కార్యాలయంలో ఆదివారం రాఘవాచారి సంస్మరణ సభ జరిగింది. టియూడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐజేయూ అధ్యక్షుడు కె. శ్రీనివాస్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, డాక్టర్ కె. రామచంద్రమూర్తి, చెన్నమనేని రాజేశ్వరరావు, ఆర్‌వీ రామారావు, చంద్రశేఖర్‌రెడ్డి, రాఘవాచారి భార్య జ్యోత్స్న, పీసీఐ మాజీ సభ్యులు కె. అమర్‌నాథ్, ఐజెయూ కార్యదర్శి వై. నరేందర్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారాయణ తదితరులు రాఘవాచారికి నివాళులు అర్పించారు. జర్నలిజం అంటే అంగట్లో అమ్ముకునే సరకు కాదని, అది ప్రజల చేతిలో ఆయుధంలా ఉండాలని తన వృత్త్ధిర్మంలో నిరూపించిన పాత్రికేయులు రాఘవాచారి అని వక్తలు కొనియాడారు. ఏటా రాఘవాచారి జయంతి సనలో మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రముఖులతో స్మారక ఉపన్యాసం నిర్వహిస్తామని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

*చిత్రం...రాఘవాచారి సంస్మరణ సభలో పాల్గొన్న వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు