రాష్ట్రీయం

గోదావరి తీరంలో కార్తీక నీరా‘జనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 12: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరి నదీ తీరం మంగళవారం కార్తీక దీప నీరాజనంతో దేదీప్యమానంగా మెరిసిపోయింది. శివనామ స్మరణతో గోదావరి తీరం ప్రతిధ్వనించింది. మంగళవారం వేకువజాము నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలను వదిలిపెట్టారు. రాజమహేంద్రవరంలోని ప్రసిద్ధ పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమీ ఘాట్ తదితరాలు భక్తులతో కిటకిటలాడాయి. గోదావరి ఒడ్డున వెలిసిన శ్రీ మార్కండేయేశ్వరస్వామి, శ్రీ కోటిలింగేశ్వర స్వామి, విశే్వశ్వరస్వామి క్షేత్రాల్లో స్వామివారిని దర్శించుకుని తరించారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు ఉపవాస దీక్షలతో దీపారాధన చేసుకున్నారు. సాయంత్రం కోటిలింగేశ్వరస్వామి ఆలయం వద్ద పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక దీపారాధన అత్యంత వైభవంగా సాగింది. స్థానిక పుష్కర ఘాట్‌లో అఖండ కార్తీక దీప నీరాజనం కన్నుల పండువగా సాగింది. బుద్ధవరపు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపాప నందేంద్ర సరస్వతి స్వామీజీ, ఏపీ రాష్ట్ర ఉప సభాపతి కోన రఘుపతి, వైఎస్సార్ సీపీ నేత లక్ష్మీపార్వతి హాజరై గోదావరి నదికి వేద మంత్రోచ్ఛారణల మధ్య గోదావరి నదికి హారతి నీరాజనం పలికారు. వేలాదిగా తరలివచ్చిన మహిళలు ఇటు పుష్కర ఘాట్‌లోనూ, అటు కోటిలింగాల ఘాట్‌లోనూ గోదావరి నదికి కార్తీక దీప నీరాజనం పలికారు. పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు సుమారు కిలోమీటర్ పొడవునా కోటిలింగాల ఘాట్‌లో నిత్యహారతి నీరాజనం పలికారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలోని నాలుగు పంచారామ క్షేత్రాలు సహా ప్రఖ్యాత శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా నవ వధువుల దీపారాధనతో ఆలయాలన్నీ కళకళలాడాయి.
*చిత్రం... రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో దీపారాధనతో మురిసిపోతున్న బాలిక