రాష్ట్రీయం

నేత్రపర్వంగా జ్వాలా తోరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, నవంబర్ 12: కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో శ్రీగిరి కిటకిటలాడింది. రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. వేకువ జామున 3 గంటలకే ఆలయం తలుపులు తెరచి ప్రాతఃకాల పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. పౌర్ణమి వేడుకల్లో భాగంగా పాతాళగంగ వద్ద సాయంత్రం పుణ్య నదిహారతి, జ్వాలా తోరణం, పుష్కరిణి వద్ద జ్వాలా తోరణం, పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కర హారతిని కన్నులపండుగగా నిర్వహించారు. ఆలయం ముందుభాగం, నాగులకట్ట, గంగాధర మండపం వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ రామారావు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్యూ లైన్లలో వేచివుండే భక్తులకు నిరంతరం తాగునీరు, పాలు, బిస్కట్లు, అల్పాహారం అందజేశారు. భక్తులకు సంతృప్తికరంగా దర్శన భాగ్యం కలిగేలా రెండు రోజుల పాటు అర్జిత అభిషేకాలు, బ్రేక్ దర్శనాలను నిలుపుదల చేశారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో జ్వాలా తోరణం, పుణ్యనదీహారతి నేత్రపర్వంగా కొనసాగాయి. పాతాళగంగ వద్ద కృష్ణవేణమ్మ తల్లికి మంగళవారం సాయంత్రం పుణ్యనది హారతి ఇచ్చారు. ముందుగా ప్రధాన అర్చకులు, ప్రధాన వేద పండితులు కృష్ణవేణి మాతకు విశేష పూజలు నిర్వహించి సారె సమర్పించారు. రాత్రి ఆలయం ఎదు ట గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్తంభాలపై నెయ్యితో ఒత్తులు అమర్చి ప్రత్యేక పూజలు చేసి వెలిగించారు. త్రిపురాసులను సంహరించిన తరువాత పరమేశ్వరుడికి దృష్టి దోష పరిహారం కోసం పార్వతీదేవి మొదటిసారి ఈ జ్వాలా తోరణం జరిపించిందని పురాణాలు చెబుతున్నాయి. అలా శ్రీశైలంలో జ్వాలా తోరణం మొదలైంది.
వైభవంగా లక్షదీపోత్సం
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలోని ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరహారతిని వైభవంగా నిర్వహించారు. శోభాయామానంగా అలంకరించిన శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పుష్కరిణి వద్దకు తీసుకుని వచ్చి వేదికపై ఆశీనులనుజేసి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా స్వామి అమ్మవార్లకు పుష్కరిణికి దశ హారతులు ఇచ్చారు.

*చిత్రం...కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో మంగళవారం జరిగిన జ్వాలా తోరణం