రాష్ట్రీయం

హైదరాబాద్‌ను యూటీ చేసే యోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే యోచన ఏదీ కేంద్రం వద్ద లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రెండోసారి టీఆర్‌ఎస్ గెలిచాక కేసీఆర్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని.. ఇదే సమయంలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ వేగంగా పెరుగుతోందని అన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితం తమ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా తమ బలం ఏమిటో నిరూపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని వార్డుల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయని అన్నారు. గతంలో కేసీఆర్‌ను సమర్థించిన కార్మికులు, ఉద్యోగులే నేడు ఆయనకు దూరమయ్యారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేయలేదని దుయ్యబట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా తమ పార్టీకి రిఫరెండం అని అన్నారు.
కేసీఆర్‌కు ధైర్యం ఉంటే కాలపరిమితి ముగిసేలోగా జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఆర్టీసీ స్థలాల్లో పెట్రోలు బంకుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలుస్తామని ఆయన తెలిపారు. లక్షల కోట్ల విలువైన జీవోలను తెలంగాణ ప్రభుత్వం దాచిపెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆయన నిలదీశారు. కొత్త అధ్యక్షుడు ఎవరనేది డిసెంబర్‌లో తేలనుందని అన్నారు. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

*చిత్రం... బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్