రాష్ట్రీయం

భవన నిర్మాణ కార్మికుల్లో భరోసాకే దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 13: వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏర్పడిన తీవ్ర ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో వారిలో భరోసా కల్పించేందుకే ఇసుక దీక్ష చేపట్టామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇసుక కృత్రిమ కొరతను వైసీపీ నేతలే సృష్టించి ఇసుక మాఫియాగా ఏర్పడి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఐదు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా 50 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. కార్మికుల కుటుంబాలు పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని, విజయవాడలో 14వ తేదీన జరిగే దీక్షను జయప్రదం చేయాలని, రెండు జిల్లాల నుండి భారీగా కార్యకర్తలను నాయకులు సమీకరించాలని పిలుపునిచ్చారు. ఇసుక, సిమెంటు, మద్యం ధరలను పెంచి వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. వ్యాపారులు తమ వ్యాపారాలు చేయాలన్నా, ఆస్తులు అమ్మాలన్నా జె-ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. కష్టాల్లో ఉన్న కార్మికులు, వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టంచేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులనే కాకుండా మిగిలిన ప్రాజెక్టుల పనులను కూడా వైసీపీ నిలిపివేసిందని, ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. 37 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా నిలుస్తుందని, 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప స్వప్రయోజనాల కోసం ఎన్నడూ పనిచేయలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాము పనిచేశామన్నారు.
జీవనోపాధి కోల్పోయాం..
విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన మత్స్యకార సంఘాల నేతలు బుధవారం మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసారు. వేట నిషేధం వలన వాకపాడు పంచాయితీ, బంగారమ్మపాలెం రెండు గ్రామాలకు చెందిన 3 వేల కుటుంబాలకు చెందిన తాము జీవనోపాధి కోల్పోయామని, 35 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మత్స్యకారుల సంఘ నేతలు కారె అప్పలరాజు, వాసుపల్లి చంటి, చొక్కా సోమేసు, కారె కృష్ణ, గోవిందు, మైలపల్లి జగ్గారావు, బోడిపల్లి జగన్నాధం తదితరులున్నారు.
బ్రాండ్ ఇమేజ్‌ను నాశనం చేసిన జగన్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో కేవలం ఏపీ మాత్రమే కాకుండా ఇండియా బ్రాండ్ ఇమేజ్ కూడా నాశనం అవుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏల విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై భారత ప్రభుత్వాన్ని జపాన్ ప్రభుత్వం ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిందని బుధవారం ట్విట్టర్‌లో చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ మెడ్ క్ జోన్ నుండి ఎలాంటి కారణం లేకుండానే మేధావులను పక్కన పెట్టడంపై ఐరిష్ మీడియా విమర్శనాత్మక కథనాలు రాసిందని తెలిపారు.
తెలంగాణ సర్పంచ్‌ల సంఘం అభినందనలు
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నిలిపారని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం చంద్రబాబుని ఆయన నివాసంలో తెలంగాణ పంచాయితీ రాజ్ చాంబర్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ నిధుల విడుదలకై ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చాంబర్ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నా, పోరాటాలకు తాము మద్దతు తెలుపుతున్నామని, అందుకే కృష్ణాజిల్లా విజయవాడలోనూ, గుంటూరు నగర కేంద్రంలో జరిగిన ధర్నాలో తాము పాల్గొని మద్దతు తెలిపామన్నారు. గతంలో అనేక జీవోలతో సర్పంచులు, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు కల్పించారన్నారు. గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ నిధులను అత్యధికంగా విడుదల చేసి అభివృద్ధికి సహకరించారన్నారు. అనంతరం నేతలు చంద్రబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ పంచాయితీ రాజ్ చాంబర్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్, తెలంగాణ చాంబర్ గౌరవాధ్యక్షుడు పుసులూరు నరేంద్ర, ఎంపీటీసీల సంఘం ప్రధాన కార్యదర్శి కుమారగౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కాసరనేని మురళి, జెడ్పీటీసీల సంఘం అధ్యక్షుడు ఆనేపు రామకృష్ణ నాయుడు, నరేగా డైరెక్టర్‌లు సుభాషిణి, సుబ్బరామయ్య, వీరంకి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... బాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న దృశ్యం