ఆంధ్రప్రదేశ్‌

ఇండో-యూఎస్ ఆధ్వర్యంలో టైగర్ ట్రింఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 14: ‘ప్రకృతి వైపరీత్యాల్లో మానవీయ సాయం’ (హెచ్‌ఏఆర్‌డీ) అంశంపై ఇండో-యూఎస్ దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు టైగర్ ట్రింఫ్ పేరిట జరుగుతున్నాయి. దీనిలో భాగంగా తూర్పు తీరంలో ఇరు దేశాల నౌకాదళాల ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన విన్యాసాలు, వివరాలను వెల్లడించారు. ఇరు దేశాల సంయుక్త విన్యాసాల్లో భారత్ నౌకాదళం నుంచి జలాశ్విన్, ఐరావత్, సంధాయక్ నౌకలు, భారతీయ ఆర్మీ దళాలు, భారత వైమానిక దళాలకు చెందిన ఎం 17 హెలికాఫ్టర్లు రాపిడ్ యాక్షన్ మెడికల్ టీంలు పాల్గొన్నాయి. యూఎస్ నౌకాదళం థర్డ్ మెరైన్ డివిజన్ నుంచి వచ్చిన దళాలతో పాటు దళాలు, యూఎస్ నేవీ నుంచి వచ్చిన జెర్మాంటన్ ద్వారా ప్రదర్శనలో పాల్గొన్నాయి. హార్బర్ దశ విన్యాసాలు ఈ నెల 13 నుంచి 16వరకూ జరుగుతాయని తెలిపారు. ఇరు దేశాల నావికులు శిక్షణ సందర్శనలో పాల్గొంటారు. అలాగే నిపుణుల మార్పిడి, క్రీడా, సాంస్కృతిక ప్రదర్శన ఉంటాయి. హార్బర్ దశ పూర్తయిన అనంతరం ఓడలు, దళాలతో సముద్ర దశ విన్యాసాలు నిర్వహిస్తారు. ఈ విన్యాసాలు తూర్పుతీరంలోని కాకినాడలో జరుగుతాయి. భారత్, యూఎస్ నేవీ సంయుక్తంగా నిర్వహించే ఈ విన్యాసాలు ఇరు దేశాల మధ్య సహకార మార్పిడి, సంబంధాల మెరుగుకు దోహదపడనున్నాయి. ఈ కార్యక్రమంలో యూఎస్ అంబాసిడర్ కెనె్నత్ జస్టిన్, తూర్పునౌకాదళం అధికారి వైస్ అడ్మిరల్ గోర్మడే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ ఇటువంటి విన్యాసాల ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. త్వరలోనే ఇరు దేశాల డిఫెన్స్ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. యూఎస్ రక్షణ రంగాల నుంచి 500 మంది, భారత్ రక్షణ దళాలకు చెందిన 1200 మంది నావికులు, సైనిక బలగాలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నారు.
*చిత్రం... తూర్పు తీరంలో యుద్ధ నౌక