రాష్ట్రీయం

ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య గౌరవాధ్యక్షులు కోదండరామశర్మ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య గౌరవాధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాఖ్య అధ్యక్షులుగా పనిచేసిన కురువృద్ధులు శ్రీమాన్ దీవి కోదండరామ శర్మ శనివారం కన్నుమూశారు. స్వగ్రామమైన గుంటూరు జిల్లా గోవాడ గ్రామంలో ఆయన మరణించారని , ఆయన మృతి అర్చక సమాఖ్య సంఘానికి, హైందవ సమాజానికి తీరని లోటు అని ఏపీ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు పేర్కొన్నారు. అర్చకుల పాలిట మరణశాసనంగా మారిన 30/87 దేవాదాయ చట్టంపై అలుపెరగని పోరాటం చేశారు. సుప్రీంకోర్టులో వారు చేసిన న్యాయ పోరాటం, తీర్పు అర్చకులకు వరంగా మారింది. అర్చకుల సంక్షేమం, పీఆర్‌సీ వేతనాలు, కనీస వేతన నిధి ఏర్పాటు, చట్టానికి సవరణలు జరగడం సుప్రీం తీర్పు ఫలితమేనని అర్చక సమాఖ్య పేర్కొంది. తాజాగా వచ్చిన వంశపారంపర్యం అర్చకత్వం జీవో 76 వారి కృషి ఫలితమలే. గత ఆరు దశాబ్థాలుగా కోదండరామ శర్మ అర్చక లోకానికి చేసిన సేవలు మరువరానివని, అర్చక సమాఖ్య నివాళులు అర్పించింది. అర్చకుల సమస్యలపై కోదండరామ శర్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలతో చర్చించి వాటి అమలుకు తీవ్రంగా కృషి చేశారు.

*దీవి కోదండరామ శర్మ (ఫైల్‌ఫొటో )